మూడు నెలల పసికందు మృతిచెందిన ఘటన నగరంలోని సుభాష్‌నగర్‌లో గల శిశుగృహలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని జీజీహెచ్‌లో ఓ మహిళ సెప్టెంబర్ 15న శిశువుకు జన్మనిచ్చింది.
తక్కువ బరువుతో పుట్టిన పాపను ఆమె చెత్తబుట్టలో పడేసి వెళ్లిపోయింది. స్పందించిన శిశుగృహ సిబ్బంది పసికందును ఆలనా పాలన చూస్తున్నారు. అయితే శరీరమంతా ఇన్‌ఫెక్షన్ కారణంగా మంగళవారం శిశువు మృతి చెందింది.
ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
