HomeHEALTHవసంత లక్ష్మి ఇందూర్ కి గర్వకారణం - అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్.

వసంత లక్ష్మి ఇందూర్ కి గర్వకారణం – అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్.

గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం దక్కించుకున్న యోగ మాస్టర్ వసంత లక్ష్మిని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తన క్యాంపు కార్యాలయంలో సన్మానించడం జరిగింది.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతు వసంతలక్ష్మీ గతంలో నోబుల్ వరల్డ్ రికార్డు,ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సాధించి మొక్క ఓని దీక్షతో గిన్నిస్ బుక్ రికార్డ్ లక్ష్యంగా సమాకోనాసనంలో గత రికార్డ్ ను అధిగమించి ఏకధాటిగా 3 గంటల 48 నిముషాలు అసనం వేసి కొత్త రికార్డు సృష్టించి గిన్నిస్ బుక్ రికార్డులో స్థానం దక్కించుకోవడం ఇందూర్ బిడ్డగా అందరికి గర్వకారణం అన్నారు.

ఇందూర్ జిల్లా అంటేనే యోగ, క్రీడాలు,సంస్కృతి కళలకు పెట్టిన పేరని అన్నారు, నేటి యువతరం విద్యతో పాటు మానసిక, శారీరక ఉల్లాసం కోసం యోగ, క్రీడలు వంటి వాటిపై దృష్టి పెట్టాలని సూచించారు.

వసంత లక్ష్మీని గిన్నిస్ బుక్ రికార్డులో నెలబెట్టిన యోగ గురువు రాంచందర్ గారిని ప్రత్యేకంగా అభినందించి, సత్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సుభాష్ , రవలి,సుమలత, శివరాజ్,హేమదర్,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments