HomeCinemaసంక్రాంతికి వస్తున్నాం’ ఈవెంట్‌లో ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే తెలంగాణ ప్రజలు తనను క్షమించాలని నిర్మాత...

సంక్రాంతికి వస్తున్నాం’ ఈవెంట్‌లో ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే తెలంగాణ ప్రజలు తనను క్షమించాలని నిర్మాత దిల్ రాజు తెలిపారు. ‘

ఆలా మాట్లాడి నందుకు క్షమించాలి :దిల్ రాజు ………..సంక్రాంతికి వస్తున్నాం’ ఈవెంట్‌లో మాట్లాడిన వెకిలి మాటలకు నిర్మాత దిల్ రాజు అలియాస్ వెంకటరమణ రెడ్డి ఎట్టకేలకు క్షమాపణ చెప్పారు.

ఏపీ ప్రజలకు సినిమాలకు వైబ్ ఇస్తారు కానీ తెలంగాణ ప్రజలు సినిమాల కన్న తెల్ల కల్లు మటన్ దావత్ లకు వైబ్ ఇస్తారంటూ చేసిన వెటకారపు మాటలకు తెలంగాణ సమాజం రగిలి పోయింది సోషియల్ మీడియా వేదికగా రాజు అహంకార మాటలను కడిగి పారేసారు బిఆర్ యస్ ఎమ్మెల్సీ దేశ్ పతి రాజు నీవు కల్లు దుకాణం పెట్టుకో అంటూ దెప్పి పొడిచారు.

నీ ఏనాడూ తెలంగాణ ఉద్యమం లో క్రియాశీలకంగా లేవు కానీ తెలంగాణ సంస్కృతీ ఎలా తూలనడుతావు అంటూ మండి పడ్డారు దీనిపై నాలుగు రోజుల తర్వాత దిల్ రాజు స్పందించారు.

సంక్రాతి కి వస్తున్నాం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే తెలంగాణ ప్రజలు తనను క్షమించాలని నిర్మాత దిల్ రాజు తెలిపారు. ‘నిజామాబాద్ జిల్లా వాసిగా ఈ సినిమా ఈవెంట్‌ను అక్కడ నిర్వహించా.

కానీ ఆ వేడుకలో తెలంగాణ సంస్కృతిలో ఉండే దావత్ గురించి మాట్లాడా. నేను తెలంగాణ సంస్కృతిని అభిమానించేవాడిని. అసలు ఈ సంస్కృతి గురించి ఎందుకు హేళన చేస్తాను?’ అని ఆయన ఓ వీడియో పోస్ట్ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments