Friday, April 24, 2026
HomeTelanganaNizamabadకేంద్రీయ విద్యాలయాలకు మహర్దశ..నిజామాబాద్, బోధన్‌ పాఠశాలల్లో అదనపు సెక్షన్లు మంజూరు..

కేంద్రీయ విద్యాలయాలకు మహర్దశ..నిజామాబాద్, బోధన్‌ పాఠశాలల్లో అదనపు సెక్షన్లు మంజూరు..

జిల్లా కేంద్రంలో ఇంటర్ (సైన్స్‌)కు గ్రీన్ సిగ్నల్..ఎంపీ అర్వింద్ కృషితో ఉత్తర్వులు జారీ చేసిన కేవీఎస్‌..జిల్లాలోని కేంద్రీయ విద్యాలయాల్లో సీట్ల కొరతతో అల్లాడుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులకు ఊరట లభించింది.

నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి చేసిన నిరంతర కృషి ఫలించడంతో, నిజామాబాద్, బోధన్‌లోని కేంద్రీయ విద్యాలయాల్లో అదనపు సెక్షన్లను మంజూరు చేస్తూ కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఉత్తర్వులు జారీ చేసింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచే ఈ అదనపు సెక్షన్లు అందుబాటులోకి రానున్నాయి.

బోధన్ కేంద్రీయ విద్యాలయం: ఇక్కడ 2వ తరగతి నుంచి 5వ తరగతి వరకు అదనపు సెక్షన్లను మంజూరు చేశారు.నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయం: జిల్లా కేంద్రంలోని పాఠశాలలో 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు అదనపు సెక్షన్లు ప్రారంభం కానున్నాయి.

ఇంటర్ విద్యకు అనుమతి: నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయంలో ఈ ఏడాది నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం (సైన్స్ గ్రూపు) ప్రారంభించేందుకు అనుమతి లభించింది. కొత్త సెక్షన్ల ఏర్పాటుతో ప్రతి తరగతికి 40 మంది చొప్పున జిల్లాలో సుమారు 320 మంది విద్యార్థులకు సి.బి.ఎస్.ఇ విధానంలో నాణ్యమైన విద్య అందనుంది.

విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాలల్లో అదనపు సిబ్బంది నియామకానికి కూడా మార్గం సుగమమైంది. కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల కోసం ఏటా వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్న నేపథ్యంలో, ఈ నిర్ణయం తల్లిదండ్రులకు పెద్ద ఊరటనిచ్చింది.

విద్యార్థుల భవిష్యత్తే నా ప్రాధాన్యత: ఎంపీ అర్వింద్ అదనపు సెక్షన్ల మంజూరుకు కేంద్ర మంత్రి కి, ఉన్నతాధికారులకి గతంలోనే విన్నవించానని, ఈ సంవత్సరం నుండి అదనపు సెక్షన్లు మంజూరవడం ఆనందంగా ఉందన్నారు.

ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించడం నా ప్రాధాన్యత అని అంటూ, కేంద్రీయ విద్యాలయాల్లో సౌకర్యాల విస్తరణ కోసం నా ప్రయత్నాలు కొనసాగుతాయని తెలిపారు. జిల్లా ప్రజలు, తల్లిదండ్రులు ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ ఎంపీ అర్వింద్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!