గర్భిణీ మహిళా కు వైద్యం వికటించడంతో మృతి చెందింది. నిజాంబాద్ నగర లో ని కాలూర్ గ్రామానికి చెంది స్రవంతి (35) నాలుగు నెలల గర్భిణి ఓ కీర్తి సాయి ఆసుపత్రి లో మృతి చెందడం తో బంధువులు ఆందోళనకు దిగారు. చేజారుతుండడమతొ అప్రమత్తం అయిన ఆసుపత్రి యాజమాన్యం బాధితులకు పదిలక్షల పరిహారం ఇవ్వడానికి సిద్ధం అయింది ఆదివారం ఉదయం నగరం లోని ఖలీల్వాడిలో కీర్తి సాయి ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది.
నాలుగు నెలల గర్భిణిగా ఉన్న స్రవంతి రొటీన్ చెకప్ లో భాగంగా ఖలీల్ వాడి లోని ప్రముఖ మహిళా డాక్టర్ ప్రేమలత ను సంప్రదించింది. గర్భంలో ఉన్న పాప పరిస్థితి బాగాలేదని , శ్వాసకు సంబంధించిన సమస్యతో ఉందని వెంటనే అబార్షన్ చేయాలని లేకుంటే ప్రమాదం ఉందని .చెప్పి అందుకు సంబంధించిన మందులు ఇచ్చి పంపేశారు.దీంతో మందులు తీసుకొని తాము ఇంటికి వెళ్ళామని మృతురాలు బంధువులు చెపుతున్నారు . మందులు వేసుకున్న అనంతరం తీవ్ర రక్తస్రావం కావడంతో ఆందోళనకు గురై శనివారం రాత్రే సదురు వైద్యుని సంప్రదించారు.
పొద్దున్నే తేవాలని చెప్పడంతో ఆదివారం ఉదయం గర్భిణీని తీసుకొని ఆసుపత్రికి తీసుకొచ్చారు కానీ … అప్పటికే ఆమె పరిస్థితి విషమించింది. దీనితో ఆసుపత్రి వర్గాలు చేతులెత్తేశారు. మరో ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించినట్లు తెలిపారు. దీంతో హుటాహుటిన ఆమె ను మరో ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించిందనిఅక్కడి ఆస్పత్రి వైద్యులు తెలపడంతో గర్భిణీ కుటింబీకుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది .
గర్భిణీ శవంతో ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట ఆందోళన కు దిగారు . గర్భిణీ కి వైద్యం అందించడంలో సదరు ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యమే నిర్లక్ష్యం చేసిందని వారు మండిపడ్డారు. చివరికి పోలీసులు వచ్చి ఆందోళన కారులను సముదాయించారు.చివరికి యాజమాన్యం దిగివచ్చి బాధితులతో రాజీ చేసుకుంది. పది లక్షల ఆర్థిక పరిహారం ఇవ్వడానికి ముందుకొచ్చింది.






