ఆన్ లైన్ లో మీ అకౌంట్ కు డబ్బులు బదిలీ చేసానని నమ్మబలికి బ్యాంకు సర్వీస్ సెంటర్ నిర్వాహకురాలు నుంచి నగదు కాజేసిన వైనం నగరంలో శివాజీనగర్ లో చోటుచేసుకుంది.బాధితురాలు పిర్యాదు మేరకు నాల్గో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
నగరం లోని శివాజీ నగర్ ఆంధ్ర బ్యాంకు ప్రక్కన వున్నటువంటి యూనియన్ బ్యాంకు ఖాతాదారుల సర్వీస్ పాయింట్ లో శనివారం సాయంత్రం 6:00 గంటలకు ఓ యువకుడు హడావిడిగా వచ్చి ఫోన్ పే ద్వారా 16,000 రూపాయలు డబ్బులు వేసానని ఆ పాయింట్ నిర్వాహకురాలు ను బురిడీ కొట్టించాడు.
నకిలీ ఫోన్ పే ట్రాంజెక్షన్ చూయించాడు. ఆ మొత్తంరూ 16 వేల నగదు ను తీసుకొని క్షణాల్లో మాయం అయ్యాడు , కొద్దీ సేపటికి సదరు నిర్వాహకురాలు తన అకౌంట్ ని చూసుకుంటే డబ్బులు రాలేవని తెలిసి లబోదిబీ మంది . మోసపోయానని తెలుసుకొని వెంటనే 4వ ఠాణా లో పిర్యాదు చేసారు.
