నగరంలోని బంగారం దుకాణంలో ఓ మహిళ చోరికి యత్నించింది. వివరాల్లోకి వెళ్లితే.. బుధవారం అర్ధరాత్రి ఆజామ్ రోడ్ లో గల బంగారు దుకాణంలో బాన్సువాడకు చెందిన మహిళ బుర్కా ధరించి బంగారు చెవి కమ్మలను కొనుగోలు చేసేందుకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు ఆ ఆమె చేతీలో సెల్ఫోన్ కింద జత కమ్మలను ఉంచుకొని, పలు డిజైన్లు చూసి నచ్చలేదని వెళ్లేందుకు యత్నించింది.అది గమనించిన షాపు యజమాని ఆమెను పట్టుకుని రెండవ టౌన్ పోలీసులకు అప్పగించారు.
సంబంధిత మహిళ బంగారు చెవి కమ్మల చోరీయత్నం దృశ్యాలు సీసీటీవీ రికార్డుల్లో అయ్యాయి.
ఈ మేరకు రెండో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని మహిళలను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
