ఓ కేసులో స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి నిందితుడు నుంచి లంచం తీసుకుంటుగా ఎస్ఐ, తో పాటు కానిస్టేబుల్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు కామారెడ్డి జల్లా లింగంపేట్ ఎస్ఐ పబ్బ అరుణ్, కానిస్టేబుల్ ( రైటర్ ) తోట రామాస్వామీ లు రూ. 10 వేలు లంచం తీసుకుంటుండంగా పోలీస్ స్టేషన్ లో నే పట్టుకున్నామని నిజామాబాద్ రేంజ్ ఏసీబీ డిఎస్పీశేఖర్ గౌడ్ తెలిపారు .
లింగంపేట్ మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన మీసేవా నిర్వాహకుడు శివ లింగం గౌడ్ నుంచి రూ.10 వేలు లంచం తీసుకున్న స్టేషన్ రైటర్ రామాస్వామీని పట్టుకుని విచారించగా..ఎస్సై అరుణ్ సూచన మేరకే డబ్బులు తీసుకున్నట్లు చెప్పడంతో ఎస్సై సైతం అదుపులోకి తీసుకున్నారు.
శివలింగం గౌడ్ ఒక వ్యక్తిపై బీరు సీసాతో దాడి చేసిన కేసులో నిందితుడు ఈ కేసులో ఇదివరకే స్టేషన్ బేయిల్ కోసం డబ్బులు తీసుకున్నఎస్సై స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా కాలయాపన చేస్తూ వచ్చాడు మళ్లీ రూ.10 వేలు ఇస్తేనే బేయిల్ ఇస్తానని వేధించడం మొదలు పెట్టాడు. దీనితో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు.
ఏసీబీఅధికారుల సూచన మేరకు శివలింగం గౌడ్ లంచం ఇస్తుండగా పట్టుబడిన ఎస్ఐ అరుణ్, కానిస్టేబుల్ రామాస్వామీలను నాంపల్లిలోని ఏసీబీ కోర్టు( ప్రత్యేక) న్యాయస్థానం ముందు హజరుపరుస్తామని డిఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు.
