సంక్షేమ హాస్టల్స్ మీద అవినీతి నిరోధక శాఖ విరుచుక పడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏక కాలం లో ఏసీబీ ఆయా ప్రాంతాల్లో ఉన్న సంక్షేమ వసతి గృహాల్లో సోదాలు చేసింది. మంగళవారం తెల్లవారు జామునే ఈ ఆకస్మిక దాడులు నిర్వహించారు.
BC, SC, ST సంక్షేమ వసతి గృహాల్లో సదుపాయాలు సరిగా లేవని ముఖ్యంగా నాణ్యమైన భోజనం అందడం లేదని వార్డెన్ లు సైతం యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నయి
ఈ నేపథ్యంలో నే తెల్లవారుజాము 5 గంటల నుంచే ACB అధికారులు విరుచుకపడ్డారు హైదారాబాద్ నగరంలో వివిధ సంక్షేమ వసతి గృహాల్లోనూ తెల్లవారు జామున నుంచే సోదాలు జరుగుతున్నాయి .
హాస్టల్ వసతి సౌకర్యాలు భోజన నాణ్యతలు ఎలా ఉన్నాయనేది విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎంత మంది విద్యార్థులున్నారు ఎంత మందికి వివరాలు నమోదు అయి ఉన్నాయనేది అరా తీశారు.
అలాగే వార్డెన్ అందుబాటులో ఉంటారలేదా ?అనేది కూడా వాకబు చేసారు.