జిల్లా పోలీస్ కమిషనర్…ద్విచక్ర వాహనదారులకు ఇక హెల్మెట్ ధారణ..రోడ్డు ప్రమాదాల్లో మరణాలకు హెల్మెట్ లేకపోవడమే కారణంనగరంలోని ఇప్పటి వరకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నప్పుడు తలపై హెల్మెట్ ఉన్నా లేకపోయినా చూసీచూడనట్టు వ్యవహరించిన పోలీసులు పంద్రాగస్టు నుంచి కఠినంగా వ్యవహ రించనున్నారు.
తనఖీల సమయంలో హెల్మెట్ ధరించకుండా పట్టుబడిన ప్రతి వాహనదారుడికి జరిమానా విధించబోతున్నారు.
జిల్లాలో ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారులు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని పోలీస్ కమిషనర్ కల్మేశ్వార్ సింగనేవర్ ఆదేశాలు జారీ చేశారు.
ట్రాఫిక్ సీఐ వెంకట నారాయణ, మాట్లాడుతూ..నగరంలో ప్రమాదాల్ని అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
అయినప్పటికీ కొంతమంది నగరవాసులు ట్రాఫిక్ నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు.హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడంతో కొన్నిసార్లు ప్రమాదాలు జరిగి తీవ్రంగా గాయపడటం,
మరణించిన సంఘటనలు కూడా గతంలో సంభవించాయి. దీని గురించి ఆగస్టు 15 నుంచి స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయబడుతుందని తెలిపారు.
నిజామాబాద్ పోలీసులు స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తూ, నిబంధనలు ఉల్లఘించే వారిపై కఠిన చర్యలు తీసుకొని,జరిమానాలు విధిస్తూ, కేసులు నమోదు చేస్తామని వాహనదారులకు హెచ్చరించారు. ఈ తనిఖీలో ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.
