HomeTelanganaNizamabadనియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించండి...అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించండి…అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

నిజామాబాదు అర్బన్ నియోజకవర్గం అభివృద్ధికి తగిన నిధులు కేటాయించమని ఇటీవల అసెంబ్లీలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గారు మాట్లాడిన విషయం తెలిసిందే,నియోజకవర్గ అభివృద్ధికి రావలిసిన పెండింగ్ నిధులు TUFIDC ఫండ్ 60 కోట్లు, నియోజకవర్గ అభివృద్ధి ఫండ్ 5 కోట్లు,స్పెషల్ ఫండ్ వంద కోట్లు వెంటనే విడుదల చేయాలని అలాగే నియోజకవర్గనికి ఇంటిగ్రెటెడ్ స్కూల్ మంజూరుకై ముఖ్యమంత్రి ఛాంబర్ లో రేవంత్ రెడ్డి గారికి సీనియర్ శాసనసభ్యులు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి గారితో కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

అర్బన్ నియోజకవర్గంలో రోడ్లు,అండర్ గ్రౌండ్ డ్రైనేజీ,ప్రభుత్వ బడులల్లో మౌలిక వసతులు, ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మరమత్తులు, కొత్త రేషన్ కార్డ్స్ తదితర అంశాలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

ఇందూర్ నియోజకవర్గ అభివృద్ధికి పార్టీలకు అతీతంగా అందరిని కలుపుకొని పోవడానికి సిద్ధంగా ఉన్నానని, వివక్ష చూపకుండా అర్బన్ నియోజకవర్గనికి నిధులు వెంటనే విడుదల చేయాలని అర్బన్ ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారికి విన్నవించుకున్నట్లు తెలిపారు

ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కావలిసిన నిధులు త్వరలో మంజూరు చేస్తాం అని సుదర్శన్ రెడ్డి గారి సమక్షంలో మాట ఇవ్వడం జరిగిందన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments