Tuesday, January 20, 2026
HomePOLITICAL NEWSబిఆర్ యస్ కు మరో ఝలక్ .......కాంగ్రెస్ లోకి మరో మాజీ మంత్రి ?

బిఆర్ యస్ కు మరో ఝలక్ …….కాంగ్రెస్ లోకి మరో మాజీ మంత్రి ?

వరుస వలస లతో ఇప్పటికే విల విలాడుతున్న బిఆర్ యస్ కు మరో ఝలక్ తగలబోతోంది. ఓ మాజీ మంత్రి పార్టీ ని వీడి కాంగ్రెస్ లో చేరడానికి రంగం సిద్ధం అవుతుంది. ఈ మేరకు ఆయన తో నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి తో సమాలోచనలు సైతం జరిపారు. నాలుగైదు రోజుల్లో చేరిక ఖరారు కానుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బిఆర్ యస్ దిగ్గజ నేత కాంగ్రెస్ లో వస్తుండడం హాట్ టాపిక్ గా మారింది.

కెసిఆర్ క్యాబినెట్ లో కీలక మంత్రి గా ఆదిలాబాద్ జిల్లాలో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన సదురు నేత ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్నారు. అప్పటి నుంచి బిఆర్ యస్ పార్టీ కి అంటీముట్ట నట్లుగానే వుంటున్నారు.ఈమద్యే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని సన్నిహితుల నుంచి ఒత్తిడి మొదలయ్యింది.

ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో కాంగ్రెస్ ప్రాబల్యం నామమాత్రంగా ఉంది.బీజేపీ చాప కింద నీరులా విస్తరిస్తుంది. లోకసభ ఎన్నికల నేపథ్యంలో మాజీ మంత్రి పార్టీలోకి వస్తే కాంగ్రెస్ పార్టీకి అదనపు బలం అవుతుందని భావిస్తుంది. అందుకే ఆయన్ని కాంగ్రెస్ లోకి తెచ్చే కార్యం ను నిజామాబాద్ జిల్లాకు ఓ మాజీ మంత్రి కి అప్పగించారు రేవంత్ రెడ్డి .

ఈ మేరకు రంగంలోకి దిగిన మాజీ మంత్రి శనివారం నేరుగా ఆయన ఇంటికి వెళ్ళి మంతనాలు జరిపారు. పార్టీలో కి రావాల్సింది ఆహ్వానించారు. ఈ మేరకు సదురు మాజీ మంత్రి సైతం సానుకూలంగానే ఉన్నారని సమాచారం. సన్నిహితులు ఇతర నేతలతో సంప్రదింపులు జరిపి నాలుగైదు రోజుల్లో నిర్ణయం వెల్లడిస్తాన్నారు. రాజకీయంగా ప్రతికూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అధికార పార్టీలోకి వెళ్లి మళ్ళీ చక్రం తిప్పాలనే ఎత్తుగడలో మాజీ మంత్రి ఉన్నారని సమాచారం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!