కరెంట్ కష్టాల మీద ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ సోషియల్ మీడియా వేదికలో సెటైర్ వదిలారు. కరెంట్ కోతలు ఎలాఉన్నాయే స్వయంగా చూసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రేవంత్ సర్కార్ కళ్ళు తెరిపించాలని ఆమె కోరారు.ఆమె పోస్టు తెగ వైరల్ అవుతుంది. జగిత్యాల లో అర్బన్, రూరల్ మండలాలకు చెందిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమం మొదలయ్యే సమాయానికి ఆ ప్రాంతంలో కరెంట్ లేకపోవడంతో.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కలుగజేసుకొని విద్యుత్ అధికారులకి ఫోన్ చేసి కరెంట్ వచ్చాక కార్యక్రమం నిర్వహించారు . కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అధికారులకు ఫోన్ చేసిన వీడియో ను కవిత పోస్ట్ చేస్తూ.. ఈ ట్వీట్ చేశారు. ” అసెంబ్లీలో కరెంట్ కట్.. అధికారిక మీటింగ్ లో కరెంట్ కట్.. రైతులకు కరెంట్ కట్.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీటింగ్ లో కరెంట్ కట్ కాసేపు కరెంట్ లేకపోతేనే మీరు అల్లాడిపోతున్నారు..
మీరు స్వయంగా ఫోన్ చేసినా కూడా కరెంటు రాని పరిస్థితి!. అంటూ ఆమె చురకలు అంటించారు.క వ్యవసాయం చేసుకుంటున్న రైతులు కరెంట్ లేకపోతే, వారికి ఎంత దుఃఖం ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి.–ప్రజల కరెంటు కష్టాలు పట్టనట్టు ప్రభుత్వం నటిస్తోంది!. ప్రచారం పై పెట్టే శ్రద్ధ పాలనపై పెట్టమని సీనియర్ గా మీరైనా ముఖ్యమంత్రి గారికి చెప్పండి.” అంటూ ఎక్స్ లో పోస్టు లో రాసుకొచ్చారు. కాగా నిన్న జగిత్యాల అర్బన్, రూరల్ మండలాలకు చెందిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమం మొదలయ్యే సమాయానికి ఆ ప్రాంతంలో కరెంట్ లేకపోవడంతో.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కలుగజేసుకొని విద్యుత్ అధికారులకి ఫోన్ చేసి కరెంట్ వచ్చాక కార్యక్రమం మొదలు పెట్టారు.