Wednesday, April 29, 2026
HomePOLITICAL NEWSఅధికార పార్టీ సేవలో తరిస్తున్న ఏసిపి …..ప్రోటోకాల్ మర్చిన వైనం ? ఆ ఎమ్మెల్యే వెంట...

అధికార పార్టీ సేవలో తరిస్తున్న ఏసిపి …..ప్రోటోకాల్ మర్చిన వైనం ? ఆ ఎమ్మెల్యే వెంట ఎస్కార్ట్ గా పొరుగు జిల్లా కు…..

అధికార పార్టీ నేతల సేవలో తరించడానికి జిల్లాలో పోలీసు అధికారులు వ్యయ ప్రయాసాలు పడుతున్నారు. ప్రోటో కాల్ రూల్స్ పక్కుపెట్టేసి అనధికార ఎస్కార్ట్ సేవలు అందిస్తూ మురిసిపోతున్నారు. అదేదో ఎస్సై సీఐ లు కాదు ఏసిపి లే ! ప్రొటొకాల్ రూల్స్ పక్కకు పడేసి ఓ ఎమ్మెల్యే వెంట ఏకంగా జిల్లా దాటి మరీ ఎస్కార్ట్ గా వెళ్లడం పోలీసు శాఖ లో చర్చనీయంశంగా మారింది.

సెలవులో ఉండి ఓ కానిస్టేబుల్ గోవా వెళ్తే సస్పెండ్ చేసిన కమిషనర్ ఓ ఏసీపీ జిల్లా దాడి ఓ ఎమ్మెల్యే కు ఎస్కార్ట్ గా వెళ్లిన ఉదంతం ఫై ఇలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. గత ప్రభుత్వ హయాంలో మంత్రులు ఎమ్మెల్యే పంచన చేరి చెలరేగిపోయిన అధికారులు ముఖ్యంగా పోలీసు అధికారుల విషయంలో రేవంత్ సర్కార్ కొరడా ఝుళిపించింది.

ఈడ్చి తన్నింది ప్రాధాన్యత లేని పోస్టింగ్ లకు విసిరేసింది. గులాబీ ముద్ర వేసుకున్న అధికారుల విషయంలో ఉక్కుపాదమే వేసింది. వారుసొంత పార్టీ నేతలను ఆశ్రయించిన కనికరించలేదు.బిఆర్ యస్ హయాంలో వెలిగి పోయిన వారిని వేటాడి వెతికి గుర్తించి పోస్టింగ్ లు ఊడబీకేసింది. డిజి నుంచి ఎస్సై దాక ఈ ఉడ్చివేత సాగింది. నేతల సేవలో వుంటే ఎలాంటి విపత్తులు ఉంటాయో పోలీసు అధికారులకు తెల్సి వచ్చేలా రేవంత్ సర్కార్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. కామారెడ్డి లో సొంత తమ్ముడికి ఎస్కార్ట్ ఇవ్వడంపై సీఎం మండిపడ్డారు. కొత్త సర్కార్ ఎంత అయితే కొత్తగా పోస్టింగ్ ల విషయంలో మాత్రం మంత్రులు ఎమ్మెల్యే లు కుప్పలుతెప్పలుగా సిఫారస్ లు చేసిన బుట్టల పడేసింది.స్థానిక ఎమ్మెల్యే జిల్లా ఇంచార్జ్ మంత్రి సిఫారస్ లను పరిగణలోకి తీసుకున్నారు.

అదికూడా ఇంటిలిజెన్స్ బాస్ నివేదిక నే ప్రామాణికంగా పోస్టింగ్ ఇచ్చారు. కొత్త పోస్టింగ్ లోకి వచ్చిన అధికారులు పథ పంథాలోనే పోలీసింగ్ చేస్తున్నారు. అదికూడా ఉన్నత స్థాయిలో ఉండే అధికారులు .నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే పొరుగు జిల్లాకు అనధికార పని మీద వెళ్ళాడు. జిల్లా కు చెందిన ఏసీపీ తన ఏరియాలో సదురు ఎమ్మెల్యే ను మర్యాద పూర్వకంగా కలిసాడు. ఇంతవరకు బాగానే ఉంది.

కానీ ఆయన వెంటే సబ్ డివిజన్ దాటి పొరుగు జిల్లాకు సైతం అదే కాన్వాయ్ లో వెళ్ళాడు. సరే అదేదో మొహమాటం కోసం వెళ్లాడనుకున్న అక్కడే ఓ మాజీ మంత్రి ఎమ్మెల్యే లతో గ్రూప్ ఫొటో కూడా దిగడం కొసమెరుపు!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!