ప్రతియేటా శివరాత్రి పండగ ను పురష్కరించుకొని గోదావరి నది స్నానం చేయడం ఆనవాయితీ. కానీ పుణ్యస్నానాలకు వచ్చిన వారు అదే గోదావరి వారిని మృత్యువుఒడిలోకి చేర్చింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టువద్ద గోదావరి లో స్నానం చేయడానికి మాక్లూర్ మండలం గుత్ప గ్రామానికి చెందిన రెండు కుటుంబాలకు చెందిన నలుగురు శనివారం. మెండోరా మండలంలోని గోదావరి నదికి వచ్చారు.
వారంతా భక్తిశ్రద్దలతో నదిలోకి దిగారు. కానీ ప్రవాహం ఎక్కువగా ఉండడమతొ ఇద్దరు గల్లంతు అయ్యారు. వారిని కాపాడే యత్నంలో మేనల్లుడిని ఒడ్డుకు తీసుకొచ్చి నప్పటికీ కొడుకును మాత్రం కాపాడుకోలేకపోయాడు. మాక్లూర్ మండలం గుత్ప ఎక్స్ రోడ్ కు చెందిన మక్కల్ రెడ్డి, కొడుకు మక్కల మహేష్, తో పాటు బావ దండగుల బాలయ్య, మేనల్లుడు దండుగుల శ్రీనివాస్ స్నానం చేయడానికి నీటి ప్రవాహానికి కొడుకు, మెనల్లుడు కొట్టుకొని పోయారు.
ఇది గమనించిన తండ్రి మక్కల్ రెడ్డి కొడుకు మేనల్లుడు ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో దండుగుల శ్రీనివాస్ ను కాపాడాడు. కొడుకు మక్కల మహేష్ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు మహేష్ కొరకు గాలించగా మహేష్ చనిపోవడంతో అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఎస్సై జి. శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
