ఒక హత్యను కప్పిపుచ్చుకోవడానికి ఇద్దరు వ్యక్తులు మరొక వ్యక్తినీ హతమార్చిన మిస్టరీ వీడింది. ఈ ఘటన నగరం లోని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మర్డర్ కేసు లో ఇద్దరు నిందితులను పట్టుకొని రిమాండ్ కు తరలించినట్లు ఏసిపి రాజా వెంకటరెడ్డి పేర్కొన్నారు.
శుక్రవారం నగరంలోని ఏసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బహదూర్,అమర్ ఖాన్,రియజ్ ఖాన్ అను ముగ్గురు మంచి స్నేహితులు.
వీరు ముగ్గురు కలిసి శ్మశానవాటిక లోని కలిపోయిన శవాల వద్ద బంగారం,వెండి ఆభరణాలు లభిస్తాయని ఈ నెల 18 న ఆర్మూర్ లోనీ ఓ శ్మశాన వాటికకు వెళ్ళారు.అక్కడ ఎలాంటి ఆభరణాలు లభించక పోవడంతో తిరిగి నిజామాబాద్ రూరల్ పరిధిలోని గుపన్ పల్లి శ్మశానవాటిక లో కూడా వేతుకుతారు.
అక్కడ కూడా ఎలాంటి వస్తులు లభించక పోవడంతో ముగ్గురు కలిసి మద్యం సేవిస్తారు.అనంతరం ఆరోజు చేసిన మొత్తం ఖర్చు విషయంలో బహదూర్,అమర్ ఖాన్,రియజ్ ఖాన్ ల విభేదం జరిగినట్లు తెలిపారు.
నగదు విషయంలో విభేదం కారణంగా అమర్ ఖాన్,రియజ్ ఖాన్ లు కలిసి పెద్ద కర్రతో బహదూర్(40) ను తలపై కొట్టి హతమార్చి పక్కనే ఉన్న పూలంగ్ వాగులో పడేసి పరారైనట్లు తెలిపారు.అనంతరం వీరి ముగ్గురికి కల్సి మరో స్నేహితుడైన యూసఫ్ ఖాన్ మరుసటి రోజు 19 న అమర్ ఖాన్,రియజ్ ఖాన్ లను బహదూర్ ఎక్కడ అని ప్రశ్నించారు.
దీంతో యూసఫ్ ఖాన్(44). ఎక్కడ విషయం బయటకు చెప్తాడో అనే భయంతో యూసఫ్ ఖాన్ ను ఆరవ టౌన్ పరిధిలో నీ ఓ చెరువులో ముంచి హత మార్చినట్లు తెలిపారు. ఒక హత్యను కప్పిపుచ్చుకోవడానికి మరొక వ్యక్తినీ హతమార్చి పరరీ అయ్యారు.
దీంతో సౌత్ రూరల్ సీఐ సురేష్ కుమార్,ఎస్ఐ ఆరీఫ్ ఆద్వర్యంలో రంగంలోకి దిగిన పోలీసులు వివిధ ఆధారాల ప్రకారం ఛేదించి నిందితులను పట్టుకొని విచారించగా నిజం ఒప్పుకున్నట్లు తెలిపారు.ఈ కేసు చేదించడంలో సౌత్ రూరల్ సీఐ సురేష్ కుమార్, ఎస్ఐ ఆరిఫ్, కిరణ్ గౌడ్, గణేష్, శ్రీనివాస్ జాదవ్, శివకుమార్, నజీమ్, వినయ్ గౌడ్ లను అభినందించారు.
