రూ.5 లక్షలకుపైగా పోగొట్టుకుని ఆత్మహత్యాయత్నంఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిఆన్లైన్ బెట్టిన్లకు మరో యువకుడు బలైపోయాడు. బెట్టింగ్ లో నష్టపోయి 22 ఏళ్ల యువకుడు ఆత్మ హత్య చేసుకున్నాడు.
ఈ ఘటన నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నిజామాబాద్ రూరల్ మండలం ఆకుల కొండూర్ గ్రామానికి చెందిన ఆకాశ్(24), భార్య,ఆరు నెలల బాబు ఉన్నారు.
ఆకాశ్ గత కొన్ని రోజులుగా ఆన్లైన్ గేమ్ కు బానిసగా మారాడు. ఇటీవల 5 లక్షల రూపాయలను గేమ్స్ లో పెట్టి పోగొట్టుకున్నాడు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిస్తే ఏమంటారోనని భయపడి మార్చి 26 న గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.
కుటుంబసభ్యులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మంగళవారం రాత్రి మృతి చెందాడు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
