HomeEditorial Specialఅర్వింద్ కు చేజారిన అవకాశం.....రేసు లో చివరి దాక వచ్చినా ......కమలం కొత్త సారథి గా...

అర్వింద్ కు చేజారిన అవకాశం…..రేసు లో చివరి దాక వచ్చినా ……కమలం కొత్త సారథి గా సీనియర్ వైపు మొగ్గు చూపిన అధిష్టానం ………రామచంద్ర రావు కు లైన్ క్లియర్ ?

చివరి దాక బీజేపీ తెలంగాణ కొత్త అధ్యక్షుడి రేసులో ఉన్న ఎంపీ అర్వింద్ కు అవకాశం దక్కేలా లేదు. ఈసారి కూడా ఆయన కు అవకాశం చేజారేలా ఉంది.

ఈసారి కూడా సీనియర్ నేతకు పగ్గాలు అప్పగించాలని అధిష్టానం భావిస్తుంది. ఇందులో భాగంగా సీనియర్ నేత రామచంద్ర రావు వైపు ఢిల్లీ పెద్దలు మొగ్గు చూపారు. కాసేపట్లో క్లారిటీ రానుంది.

బీసీ వర్గాలకే పగ్గాలు అప్పగించబోతున్నారంటూ జరిగిన ప్రచారం నేపథ్యంలో ఎంపీ లు ఈటెల రాజేందర్ ధర్మపురి అర్వింద్ లపేర్లు తుది పరిశీలనకు వచ్చాయి.

అమిత్ షా నిజామాబాద్ పర్యటన సూపర్ సక్సెస్ అయినా సంబరాల్లో ఉన్న కాషాయం శ్రేణులు అర్వింద్ కు అధ్యక్ష పదవి గంపెడు ఆశలతో ఉండే. ఆయనకే ఖరారు కాబోతుందని అమిత్ షా సభ కు వచ్చిన నేతలు ధీమాతో ఉండే. ఫై అధిష్టానం సుదీర్ఘ కసరత్తులు చేసింది.

పార్టీవర్గాలతో విస్తృత సంప్రదింపులు జరిపింది. అధ్యక్ష పదవీ కోసం అరడజన్ మంది ఆశిస్తున్నట్లు అంచనాకు వచ్చింది. వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్నబీజేపీ బీసీ ఫార్ములా తెరమీదికి తెచ్చింది.

బిసి వర్గాలకే అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని భావించింది. దీనితో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ పేరు అనూహ్యంగా తెరమీదికి వచ్చింది. ఢిల్లీ స్థాయిలో పలుకుబడి ఉన్న అర్వింద్ ను ఆర్ యస్ యస్ సైతం వెన్నుతట్టింది.

మరో వైపు మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ పేరు సైతం తుది పరిశీలనకు చేరింది. ఈటెల కు పగ్గాలు అప్పగించడానికి ఆర్ యస్ యస్ నుంచి ప్రతిఘటన ఎదురైంది.

అర్వింద్ ఈటెల లకు అధ్యక్ష పదవి రేసు లో రావడం తో తెలంగాణ బీజేపీ సీనియర్లు ఏకం అయ్యారు అంత కలసి కట్టుగా సంఘ్ పెద్దలతో పాటు ఢిల్లీ పెద్దలను ఆశ్రయించి సీనియర్ లలో ఒకరి పేరు ను పరిశీలించాలని ఒత్తిడి చేశారు.

ఈ నేపథ్యంలోనే రామచంద్ర రావు పేరు తెరమీదికి వచ్చింది.ఆయన వైపే అధిష్టానం మొగ్గు చూపింది. ఇద్దరు కేంద్ర మంత్రులు సైతం సై అనడం తో అధ్యక్షుడి కోసం మొదలైన సుదీర్ఘ కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది.

ఈసారి కూడా అధ్యక్ష పదవి అర్వింద్ చేజారింది. అమిత్ షా టూర్ తో జోష్ లో ఉన్న ఆయన వర్గీయులు ఒక్కసారిగా డీలా పడ్డారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments