లోకసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోపే అభ్యర్థులను రంగంలోకి దించాలనే ఆలోచనలో ఉన్న ప్రధాన పార్టీలు అభ్యర్థుల విషయంలో వ్యూహాత్మక జాప్యం సాగిస్తున్నారు. గెలుపు గుర్రాల కోసం ఎడతెగని కసరత్తులు చేసిన పార్టీలు సామజిక సమీకరణలే ప్రాతిపదికన అభ్యర్థులను ఖరారు చేసుకున్నారు. ఐవైఆర్ సర్వే లు కూడా చేసుకున్నారు. బీజేపీ మాత్రం ఎలాంటి హడావుడి చేయకుండా కనీసం ఇంచార్జ్ కూడా నియమించకుండానే సిట్టింగ్ ఎంపీ అర్వింద్ కు మరోసారి టికెట్ ను ఖరారు చేసింది.
మొదటి జాబితా లో ఆయన పేరు ప్రకటించారు. అర్వింద్ టికెట్ మీద భరోసా తో చాలారోజుల ముందే కార్యక్షేత్రంలో దిగి ప్రచారం మొదలుపెట్టారు. కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ అధికారం కోల్పోయిన బిఆర్ యస్ లు ఇంకా అభ్యర్థులను ప్రకటించే విషయంలో ఎటూ తేల్చుకోలేక పోతున్నాయి. లోకసభలను ఛాలెంజ్ గా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విషయంలో ఇంకా స్పష్టత ఇవ్వలేక పోతుంది.
మొదటి జాబితా లో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు దాదాపు ఖరారు అయింది. ఆయన తప్పా మరో బలమైన నేత లేక పోవడం తటస్థులెవ్వరూ ముందుకు రాకపోవడంతో జీవన్ రెడ్డి ఫైనల్ అయ్యారు. కానీ ఒకరిద్దరు బిసి నేతలు పట్టుబడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ ఒక్క టికెట్ ఇవ్వలేదని కనీసం ఎంపీ టికెట్ అయినా బీసీ కి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ సీనియర్ నేతలతో పాటు రేవంత్ రెడ్డి కూడా జీవన్ రెడ్డి వైపే మొగ్గుచూపుతున్నారు. మరో బిఆర్ యస్ లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది.
మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వైపే అధినేత మొగ్గుచూపుతున్నారు.మొదట పోటీ చేయడానికి ఆసక్తి చూపని బాజిరెడ్డి కేటీఆర్ ప్రోత్సహం తో ముందుకువచ్చారు. బాజిరెడ్డి కి టికెట్ కు లైన్ క్లియర్ చేసినా సరే అధిష్టానం నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాకపోవడంతో బాజిరెడ్డి సైలెంట్ గా ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన వచ్చాకే నిజామాబాద్ అభ్యర్థి ని ప్రకటించాలనేది బిఆర్ యస్ అధినేత ఆలోచనగా ఉంది