ఆగి ఉన్న లారీ నీ ఢీకొట్టిన ఘటన లో ఆసుపత్రి కి వెళ్తున్న తండ్రి తనయుడు మృత్యువాత పడ్డారు. మోర్తాడ్ మండలం దొన్కల్ గ్రామానికి చెందిన రవీందర్(55) కు కిడ్నీలు ఫెయిల్ కావడంతో డయాలసిస్ చేయిస్తున్నారు. ఈ క్రమంలో కొడుకు రాజు (22)తో కలిసి శుక్రవారం తెల్లవారు జామున డయాలసిస్ కోసం ఇంటి నుండి బైకు మీద వెళ్లారు .
ఇంటి వెళ్లిన పదిహేను నిమిషాలకే రోడ్డు పక్కనే నిలిపి ఉంచిన లారీకి డీ కొట్టుకొని అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. ఘటన సమాచారం అందుకొన్న ఎస్సై వినయ్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు.శివరాత్రి పర్వదినం రోజే తండ్రి తనయులు మృత్యువాత పడడం తో కుటింబీకులు కన్నీరుమున్నీరు అవుతున్నారు