- పట్టించుకోని అధికారులు
- ఆర్మూర్ మండలం చేపూర్ లో గ్రామస్తులపై పిచ్చి కుక్కల దాడి
- ఏడుగురికి తీవ్ర గాయాలు
- ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు
- కుక్కల బెడదను అరికట్టాలని గ్రామస్తుల డిమాండ్
ఈ కుక్కలకు ఏమవుతోంది…? అప్పటివరకు రోడ్లపై ప్రశాంతంగా ఉన్న శునకాలు ఒక్కసారిగా రెచ్చిపోతున్నాయి. కనిపించిన వారిపై దాడికి ఎగబడుతూ కండలను కొరికేస్తున్నాయి.
ఇప్పటివరకు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కుక్కల దాడికి గురై ఆస్పత్రి పాలైన వారు ఎందరో ఉన్నారు.
తాజాగా ఆదివారం ఆర్మూరు మండలం చేపూర్ గ్రామంలో ఒక్కసారిగా ఎగబడిన పిచ్చి కుక్కల దాడిలో 8 మందికి పైగా తీవ్ర గాయాలపాలై ఆసుపత్రి పాలవడం కలకలం రేపుతుంది.
విశ్వాసానికి మారుపేరైన ఒక్కసారిగా మనుషులపై ఎందుకు ఎగబడుతున్నాయో అంతుచిక్కక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.కుక్కల బెడద ఆర్మూర్ డివిజన్ లో రోజురోజుకు ఎక్కువవుతుంది.
చేపూర్ గ్రామంలో కుక్కల దాడిలో ఏడుగురు తీవ్ర గాయాలు పొందిన వైనం చూస్తుంటే ఈ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.ఆర్మూర్ మండలం చేపూర్ లో వీధి కుక్కలు వీర విహంగం చేశాయి. గ్రామస్తులపై ఒకసారి పిచ్చిపిచ్చిగా విరుచుకుపడ్డాయి.
భయంతో పరిగెత్తుతున్న వారిని వెంటాడి మరి ఏడుగురి కి తీవ్ర గాయాలు చేశాయి. చేపూర్ గ్రామంలో గత కొంతకాలంగా గ్రామంలో వీధి కుక్కల బెడద ఎక్కువైంది.
దీనిని అరికట్టాల్సిన స్థానిక గ్రామపంచాయతీ సిబ్బంది పట్టించుకోకపోవడంతో ప్రజలకు ప్రాణాపాయ పరిస్థితి నెలకొంది.
తాజాగా ఆదివారం వీధి కుక్కల గుంపు గ్రామస్తులపై దాడి చేసి ఏడుగురికి తీవ్ర గాయాలు చేయడంతో హుటాహుటిన గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
చేపూర్ గ్రామంలో
ఒంటరిగా వెళ్తున్న వారిపై గుంపు గుంపులుగా కుక్కలు దాడి చేస్తుంటే అడుగు బయట పెట్టాలంటే ప్రజలు భయపడుతున్నారు.
పెరిగిన కుక్కల గుంపులను చూసి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి వీది కుక్కల నుంచి తమ ప్రాణాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.