పట్టాల మీద ఆడుకుంటుండగా రైలు ఢీకొట్టిన ప్రమాదంలో తండ్రి తో సహా ఇద్దరు కూతుళ్లు మృత్యువాత పడిన విషాద ఉదంతం మేడ్చల్ చోటుచేసుకుంది.
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌడవెల్లీ సమీపంలో పట్టణంలోని రాఘవేంద్ర నగర్ కాలనీకి చెందిన రైల్వే లో పనిచేస్తున్న కృష్ణ, ఆదివారం తన ఇద్దరు కుమార్తెలు వర్ష, వర్షిణిలతో కలసి స్టేషన్ కు వచ్చాడు .
ఆయన అక్కడే రైల్వే లైన్‌మెన్‌గా పని చేస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో పిల్లలు ఆడుకుంటారనే ఉద్దేశ్యంతో తన వెంట తీసుకొచ్చాడు. కృష్ణ విధుల్లో నిమగ్నమై ఉన్నారు.
పిల్లలు ట్రాక్‌మీద ఆడుకుంటున్నారు . అదే సమయంలో ట్రాక్‌పైకిట్రైన్ దూసుకొచ్చింది. అది గమనించిన తండ్రి తన కూతుళ్ళ ను కాపాడబోయి రైలు ను ఢీకొన్నాడు అంతే కూతుళ్ళ తో పాటు తానూ ప్రాణాలు కోల్పోయాడు.
