Tuesday, January 20, 2026
HomePOLITICAL NEWSబిఆర్ యస్ అభ్యర్థిగా బాజిరెడ్డి

బిఆర్ యస్ అభ్యర్థిగా బాజిరెడ్డి

బిఆర్ యస్ లోకసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి గా బాజిరెడ్డి గోవర్ధన్ ఖరారు చేశారు.సామజిక సమీకరణ మీద అధినేత ఎడతెగని కసరత్తులు చేసారు. పార్టీకి ప్రతికూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో బలమైన సామాజిక వర్గం ఉన్న మున్నూరుకాపు కు చెందిన మాజీ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వైపే అధిష్టానం మొగ్గుచూపింది .

బీజేపీ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ అర్వింద్ కూడా మున్నారుకాపు సామాజికవర్గమే కావడంతో ఆయన వోటు బ్యాంకు ను గండి కొట్టే వ్యూహం తోనే గోవర్ధన్ ను రంగంలోకి దించారనేది ప్రతివర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. మొదట అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో పోటీకి వెనుకాడిన బాజిరెడ్డి గోవర్ధన్ అధినేత ఒత్తిడి తో పోటీకి ముందుకు వచ్చారని సమాచారం.

కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామజిక వర్గం నేతకే టికెట్ ఖరారు చేస్తుండంతో బలమైన బీసీ నేతకోసం బిఆర్ యస్ కసరత్తులు చేసింది. మొదట పద్మశాలి వర్గం కు చెందిన ఎల్ రమణ పేరు తెరమీదకి వచ్చింది. నిజామాబాద్ లోకసభ పరిధి రెండు న్నర లక్షల పై చిలుకు ఓట్లు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ నుంచి అనిల్ ఇరవత్రి కూడా టికెట్ రేసులో ఉన్నారు. అదీగాక రమణ ఎమ్మెల్సీ గా ఉన్నారు.

ఆయన గెలిస్తే ఎమ్మెల్సీ స్థానం కోల్పోవాల్సి వస్తుందని భావించే గోవర్ధన్ వైపు మొగ్గు చూపారు బీజేపీ అభ్యర్థి అర్వింద్ కు గట్టి పోటీ ఇవ్వాలంటే అదే సామాజిక వర్గం కు చెందిన నేతనే రంగంలోకి దించాలనే ఆలోచనతో నాలుగు సార్లు ఎమ్మెల్యే గా పనిచేసిన బాజిరెడ్డి గోవర్ధన్ దీటైన అభ్యర్థిగా భావించారు .ఆయన గతంలో ఆర్మూర్ ఎమ్మెల్యేగా పనిచేసారు. ఆర్మూర్, బాల్కొండ సెగ్మెంట్ లలో ఆయన కు బలమైన ఫాలోఇంగ్ ఉంది.

భారీ బంధు గణం కూడా ఉంది. . నిజానికి అర్వింద్ ఈ ఎన్నికల్లో ఎలాగైనా ఓడించే వ్యూహరచనలో ఉన్న బిఆర్ యస్ . అర్వింద్ కు 2019 ఎన్నికల్లో అండగా ఉన్న మున్నూరు కాపు వోట్ల ను చీల్చడానికే బాజిరెడ్డి గోవర్ధన్ ను రంగంలోకి దించిందని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. దూకుడుగా వైఖరి తో ఉండే గోవర్ధన్ అయితేనే క్యాడర్ లో జోష్ వస్తుందని అంచనాకు అధినేతవచ్చారు . ఎమ్మెల్సీ కవిత సైతం బాజిరెడ్డి కోసమే పట్టుబట్టారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!