ఏటియం లే లక్ష్యం దొంగలు ముఠా జిల్లాలో మరోసారి దోపిడీ కి తెగబడింది.రుద్రూర్ మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలోకి చొరబడిన దొంగలు గ్యాస్ కట్టర్ లతో బీభత్సం సృష్టించారు. అందులో ఉన్న నగదు సుమారు రూ.25 లక్షలను ఎత్తుకెళ్లారు . స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు ఏటీఎంవద్ద ఉన్న సీసీ కెమెరా లో రికార్డు అయిన దృశ్యాలను పరిశీలించారు.
బ్యాంక్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.నిజామాబాద్ జిల్లాలో ఏటియం చోరీ ఉదంతాలు పోలీసుల సవాల్ గా మారాయి .ఈ దోపిడీల కు పాల్పడుతుంది పొరుగు రాష్ట్రాల ముఠా లే కావచ్చని అనుమానిస్తున్నారు