నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నుంచి ద్విచక్ర వాహనం చోరి అయ్యింది. నగరంలోని దుబ్బా ప్రాంతానికి చెందిన రాజు తన భార్య అనారోగ్యం కారణంగా సోమవారం ప్రభుత్వాసుపత్రికి వచ్చారు.
ఈ మేరకు ఆస్పత్రి ఆవరణలోని పార్కింగ్ స్థలంలో తన ద్విచక్ర వాహనాన్ని నిలిపి ఆసుపత్రి లోపలికి వెళ్ళాడు. అనంతరం తిరిగి వచ్చి చూసేసరికి బైక్ చూపించలేదు. దీంతో బాధితుడు నగరంలోని ఒకటవ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
