కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలను అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. నగరంలోని కలెక్టర్ మైదానంలో నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డి ఎస్ స్మారక క్రీడలకు బుధవారం ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం క్రీడలను విస్మరించిందని తాము అధికారంలోకి వచ్చాక దృష్టి సారించామని అన్నారు. రాష్ట్రంలో త్వరలో క్రీడా యూనివర్సిటీ మరియు క్రీడాకారులకు సకల సదుపాయాల కొరకు నిర్మిస్తామని ఆయన అన్నారు.
క్రీడాకారులు తీర్చినందుకు వ్యాయామ ఉపాధ్యాయుల భర్తీలు, కోచ్ లను భర్తీ చేస్తుందని ఆయన అన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కింద ఇప్పటికే మరమ్మతులు పూర్తయ్యాయని అన్నారు.
జిల్లాలో నూతన స్టేడియానికి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు అన్నారు. అలాగే టోర్నమెంట్ ను నిర్వహిస్తున్న ధర్మపురి సంజయ్ని ఆయన అభినందించారు. డిఎస్ సొసైటీ కి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తలవంతుగా 50వేల రూపాయలు ధర్మపురి సంజయ్ కి అందజేశారు.
ఈ టోర్నీ చైర్మన్ ధర్మపురి సంజయ్ మాట్లాడుతూ ముందుగా తండ్రి డి శ్రీనివాస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కి వున్నా అనుబంధాన్ని గుర్తు చేశారు. డిఎస్ సొసైటీ ద్వారా క్రీడలు నిర్వహించడం గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అని అన్నారు.
ప్రతి సంవత్సరం టోర్నమెంట్లు నిర్వహిస్తూ క్రీడాకారులకు ప్రోత్సహిస్తామని అలాగే నగదు బహుమతిని కూడా అందజేస్తున్నామని ఆయన అన్నారు. ఈ టోర్నమెంట్లో జిల్లా నలుమూలల నుండి సుమారు ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల నుండి 170 పాఠశాలలు పాల్గొన్నట్లు ఆయన అన్నారు.
ఖో ఖో లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు షీల్డ్ తో పాటు నగదు బహుమతిని అందజేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నగేష్ రెడ్డి, జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు భక్తవత్సలం, ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు వేణురాజ్, గోపి, అంతి రెడ్డి విజయపాల్ రెడ్డి, టోర్నీ నిర్వాకులు డి.సాయిలు, విద్యాసాగర్ రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.



