నగరంలోని శివారులోని అశోక్‌సాగర్‌లో శనివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి చెరువులో నుంచి బయటకు తీశారు.
మృతుడి వయసు సుమారు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంటుందని ఎస్‌ఐ సందీప్ తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడా, లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడిని ఎవరైనా గుర్తిస్తే వెంటనే ఆరవ టౌన్ పోలీసులను సంప్రదించి సమాచారం అందించాలని ఎస్‌ఐ సందీప్ కోరారు.
