HomePOLITICAL NEWSరేవంత్ వర్సెస్ ఉత్తమ్ ....నాలుగు జిల్లాలో రైస్ మిల్లు లో విజిలెన్స్ సోదాలు...

రేవంత్ వర్సెస్ ఉత్తమ్ ….నాలుగు జిల్లాలో రైస్ మిల్లు లో విజిలెన్స్ సోదాలు ….రగిలి పోయిన ఉత్తమ్ …….దిద్దుబాటు కు దిగిన సీఎంవో ……కేసుల ఫై అధికారుల అంతర్మథనం?

ఇప్పటికే అనేక మంది క్యాబినెట్ లో మంత్రులతో వైరం సీఎం కు తలనొప్పి వ్యవహారంగా వుంటే ఇప్పుడు ఏకంగా సీనియర్ మంత్రి తోనే రగడ మొదలు అయింది. నాలుగు జిల్లాలో రైస్ మిల్లులో విజిలెన్స్ సోదాలు ప్రభుత్వ పెద్దల్లో కల్లోలం రేపింది.

అవునూ ఈ వ్యవహారం సీఎం రేవంత్ వర్సెస్ సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ లుగా మారింది. తన శాఖ నిర్వహణలో ఉండే విజిలెన్స్ అధికారులు తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా రైస్ మిల్లు లో సోదాలు చేయడం ఉత్తమ్ రెడ్డి రగిలి పోయారు విజిలెన్స్ అధికారులమీద శివాలెత్తి పోయారు.

ఎహే ఇక తాడో పేడో తేల్చుకుంటా ననడం చివరికి చిలికి చిలికి గాలి వానలా మారడంతో సీఎంవో రంగంలోకి దిగింది మంత్రి ని బుజ్జగింపులు చేసింది. కానీ మిల్లర్ల మీద నమోదు చేసిన కేసుల ను ఎలా వెనక్కి తీసుకోవాలో తెలియక జుట్లు పీక్కుంటున్నారు.

ప్రభుత్వం వద్ద మిగిలి పోయిన వడ్ల ను అమ్మకానికి సివిల్ సప్లై శాఖ ఆన్ లైన్ టెండర్లు ను ఆహ్వానించింది ఆయా జిల్లాలకు చెందిన బడా మిల్లర్లు పోటా పోటీగా ముందుకు వచ్చి ఆన్ లైన్ లోనే బిడ్డింగ్ దాఖలు చేశారు. అయితే తక్కవ రేట్ కు కోట్ చేసిన కొందరు మిల్లర్లు సిండికేట్ లుగా మారారు.

కానీ కొందరు బడా మిల్లరు అంచనాలకు మించి కోట్ చేశారు.అయితే అది మింగుడు పడని కొందరు మిల్లర్లు మీడియా లో లీక్ లు వదిలారు.ఇందులో భాగంగా వడ్ల కొనుగోలు లో గోల్ మాల్ జరిగిందంటూ ఆంద్రజ్యోతి లో వార్త వచ్చింది.

దీనితో సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంబంధిత మిల్లర్ల సంగతి చూడలంటూ విజిలెన్స్ అధికారులను పురమాయించారు సీఎం ఆదేశాలతో ఉరుకులు పరుగులుగా నిజామాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం జిల్లాకు వెళ్లిన అధికారులు వడ్ల టెండర్లు వేసిన మిల్లులను టార్గెట్ గా సోదాలు చేసారు.

ఎడాపెడా కేసులు నమోదు చేసారు. అయితే విజిలెన్స్ బృందాలు సోదాల విషయం తెల్సి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ రెడ్డి రగిలి పోయారు తన పోర్ట్ పోలియో పరిధి లో ఉండే విజిలెన్స్ అధికారులు తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా ఎలా మిల్లులో సోదాలు చేస్తారంటూ ఉత్తమ్ అధికారులను చెడామడా వాయించారు కానీ సీఎంవో నుంచి ఆదేశాలతోనే సోదాలు చేశామన్నారు.

అయిన నేరుగా సీఎంవో అధికారులతో నిప్పులు చెరిగారు.విషయం మరింత క్లిష్టంగా మారడం తో మంత్రి ఉత్తమ్ ను బుజ్జగించడానికి సీఎంవో లో ఓ కీలక అధికారి రంగంలోకి దిగారు.

ఇందులో భాగంగా నిజామాబాద్ లో క్లిన్ ఇమేజ్ ఉన్న సిద్దరాంశ్వర్ ఆగ్రో ఇండస్ట్రీస్ లోకి వెళ్లారు సీఎంఆర్ వడ్ల కోసం వాకబు చేసారు ప్రభుత్వం కేటాయించిన రెండు గోదాంల తో పాటు మరో ఆరు ప్రైవేట్ గోదాం ల్లో వడ్లు ఉన్నాయని యజమాని స్పష్టం చేసారు అయితే ప్రైవేట్ గోదాం ల్లో సరుకు ఉంచిన విషయంల ప్రభుత్వ రికార్డ్ ల్లో లేదంటూ సన్నాయి నొక్కులు నొక్కారు

అది జెస్ట్ సాంకేతిక పొరపాటని కావాలంటూ వడ్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలని సదురు యజమాని కోరారు కానీ ఇవేవి పట్టించుకోని విజిలెన్స్ అధికారులు సీఎంఆర్ వడ్లు లేవంటూ కేసులు నమోదు చేశారు దీనిపై స్థానిక రైస్ మిల్ అసోసియేషన్ లు ఆగ్రహం వ్యక్తం చేసారు

కళ్ళముందే వడ్లు ఉన్నా సరే కేసులు ఎలా చేస్తారంటూ మండి పడ్డారు వారు జిల్లాకు చెందిన ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి ని కల్సి విన్నవించారు ఆయన విజిలెన్స్ ఐజి తో మాట్లాడారు కానీ సీఎం నుంచి ఆదేశాలు వచ్చాయని చెప్పడంతో ఆయన నేరుగా సీఎం ను కల్సి విషయం చెప్పి నట్లు సమాచారం

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments