రాష్ట్రాల్లోని కోర్టులకు మరోసారి బాంబు బెదిరింపులు రావడం తో పోలీసులు ఉరుకులు పరుగులు తీశారు .
తెలంగాణలోని నాంపల్లి సీబీఐ, కరీంనగర్ కోర్టులు, అటు ఏపీలో అనంతపురం, రాజమండ్రి సెంట్రల్ జిల్లా కోర్టులో బాంబులు పెట్టామని, మధ్యాహ్నం 12.05 గంటలకు ఇవి బ్లాస్ట్ అవుతాయని మెయిల్స్ రావడంతో పోలీసులు అలర్టయ్యారు.
12 ఆర్ డి ఎక్స్ మరోసారి కోర్టు లకు బాంబు బెదిరింపు లు బాంబులను కోర్టుల్లో పెట్టామని, ప్రార్థనలకు ముందే అన్ని న్యాయమూర్తులను కోర్టుల నుంచి ఖాళీ చేయించండంటూ మెయిల్ లో పేర్కొన్నారు.
దీంతో ఆయా కోర్టుల నుంచి జడ్జిలు, న్యాయవాదులు, పబ్లిక్ ను కోర్టుల ఆవరణల నుంచి బయటకు పంపి, బాంబు స్క్వాడ్స్ తో తనిఖీలు చేపట్టారు.
