మేడ్చల్ – పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలోని సర్వే నం 1లో ఉన్న భారీ నిర్మాణాలు కూల్చివేస్తున్న అధికారులు.. కూల్చివేత అడ్డుకున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోచయ్య, హరిశంకర్ రెడ్డి అరెస్ట్
మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డిపై మండిపడ్డ పీర్జాదిగుడా మేయర్ జక్క వెంకట్ రెడ్డి.. పీర్జాదిగుడాను కాంగ్రెస్ పార్టీ మేయర్ పదవి కోసం సీలింగ్ భూముల పేరు చెప్పి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం.
తన అల్లుడు అమర్ సింగ్ ను మేయర్ చేయాలని, అక్రమాస్తులను కూడబెట్టుకోవాలని కుట్రలో భాగమే ఈ కూల్చివేతలు.
తమ నిర్మాణాలకు హెచ్ఎండీఏ, పీర్జాదిగూడ మున్సిపల్ నుంచి అన్ని అనుమతులు ఉన్నాయి.. పైసా పైసా జమ చేసి ఇంటి స్థలాలు కొనుగోలు చేసి నిర్మాణాలు చేపడుతున్నామన్న బాధితులు
రెవెన్యూ శాఖ అధికారులు మా స్థలాలకు ఎన్వోసీ కూడా ఇచ్చారు
కాంగ్రెస్ కార్పొరేటర్లు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి మా నిర్మాణాలను కూల్చి వేయిస్తున్నారని వాపోతున్న బాధితులు.