బిఆర్ యస్ పార్టీ శ తలపెట్టిన దీక్షా దివాస్ శుక్రవారం నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో మొదలయ్యింది.గులాబీ శ్రేణులు భారీగా తరలి వచ్చారు.
ఎమ్మెల్సీ కవిత ఈ దీక్షా కు హాజరు కానున్నారని ఆమె సన్నిహితులు ప్రచారం చేసారు కానీ రాలేక పోయారు. మరో ఎమ్మెల్సీ ఫరూఖ్ ముఖ్య అతిథి గా వచ్చారు.
జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి సమన్వయము చేశారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే లు బిగాల గణేష్ గోవర్ధన్ ఆయెషా తదితరులు వచ్చారు.
ఈ దీక్షా కు భారీఎత్తున ప్రజలను తరలించడానికి పార్టీ నేతలు కొద్దీ రోజుల ముందే సన్నాహాలు చేశారు.ఒక్కో సెగ్మెంట్ కు కనీసం వెయ్యి మంది ని తరలించాలని ప్రణాళిక వేశారు.
