హయత్ నగర్ స్టేషన్ లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ దారుణ హత్య కు గురయ్యారు ఆమె వాహనం తో ఢీకొట్టి ఆతర్వాత కత్తులతో పొడిచి హత్య చేసారని అనుమానిస్తున్నారు ఈ అమానుషానికి ప్రేమ పెండ్లికి కారణంగా చెప్తున్నారు హయత్ నగర్ పోలీస్ స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ నాగమణి.
సోమవారం స్టేషన్ కు వెళ్తుండగా రాయపోలు నుంచి ఎండ్లగూడ రహదారిపై తన బైక్ పై వెళుతున్న సమయంలో.. ఆమెను వెనక నుంచి కారుతో ఢీకొట్టారు దుండగులు. కారు వేగంగా ఢీకొట్టటంతో.. ఆమె ఎగిరి రోడ్డుపై పడింది. ఆ వెంటనే.. కారులో నుంచి బయటకు వచ్చిన ఆగంతకులు అప్పటికే తీవ్రంగా గాయపడ్డ ఆమెను కత్తులతో పొడిచారని అనుమానిస్తున్నారు నాగమణి శరీరంపై ఐదు కత్తిపోట్లు ఉన్నాయి ఆమె రోడ్డుపై ప్రాణాలు కోల్పోయింది .
ఆమెది ప్రేమ పెండ్లి నాగమణికి15 రోజుల క్రితమే పెళ్లయ్యింది. ఈ పెళ్లి ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదు. ఇంట్లో వాళ్లను ఎదిరించి.. తాను ప్రేమించిన యువకుడి తోనే పెళ్లి చేసుకున్నది . అప్పటి నుంచి ఇంట్లో వాళ్లతో దూరంగా వుంటుంది.నాగమణి స్వగ్రామం ఇబ్రహీంపట్నం మన్నెగూడ.
హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తుంది. మన్నెగూడ నుంచి ఇబ్రహీంపట్నం వెళుతున్న సమయంలోనే ఈ ఘటన జరిగింది.
