HomeCRIMEవ్యాపార లావాదేవీలే కిడ్నాప్‌కు కారణం!

వ్యాపార లావాదేవీలే కిడ్నాప్‌కు కారణం!

  • భాగస్వామిపై కక్షతో సుపారీ గ్యాంగ్‌కు బాధ్యతలు
  • అడవిలో బలవంతంగా బాండ్లపై సంతకాలు..
  • గచ్చిబౌలిలో వదిలేసిన దుండగులు

వ్యాపారంలో తలెత్తిన విభేదాలు కిడ్నాప్‌కు దారితీసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. గాజులరామారానికి చెందిన వ్యాపారి అశోక్‌రెడ్డి అపహరణ వెనుక ఆయన వ్యాపార భాగస్వామి చంద్రశేఖర్‌ ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. వ్యాపార లావాదేవీల్లో తప్పుడు లెక్కలు చూపించి మోసం చేశాడన్న అనుమానంతో అశోక్‌రెడ్డి నిలదీయడంతో చంద్రశేఖర్‌ కక్ష పెంచుకున్నట్లు తెలిసింది.

అశోక్‌రెడ్డి, చంద్రశేఖర్‌ మూడేళ్లుగా కలిసి వ్యాపారాలు చేస్తున్నారు. నష్టాలు రావడం, లెక్కల విషయంలో విభేదాలు తలెత్తడంతో ఇద్దరి మధ్య వివాదం ముదిరింది. ఈ నేపథ్యంలో చంద్రశేఖర్‌ సుపారీ ముఠా సాయంతో అశోక్‌రెడ్డిని అపహరించినట్లు దర్యాప్తులో గుర్తించారు.

ఆయనను జడ్చర్ల సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి బలవంతంగా బాండ్‌ పత్రాలపై సంతకాలు చేయించినట్లు తెలుస్తోంది. అనంతరం గచ్చిబౌలిలో వదిలేసి నిందితులు అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం.

ఈ నెల 7న పిల్లలను పాఠశాలలో దించి తిరిగి వస్తున్న అశోక్‌రెడ్డిని కారులో వచ్చిన ఐదుగురు వ్యక్తులు అడ్డగించి దాడి చేసి అపహరించారు. ఈ ఘటనపై ఆయన భార్య స్వాతి ఫిర్యాదు చేయడంతో జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కిడ్నాప్‌లో పాల్గొన్నవారి వివరాలను సేకరిస్తూ నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments