బీఆర్ ఎస్ కీలక నాయకురాలు, ఎమ్మెల్సీ కవితకు తాజాగా సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఈ సందర్భంగా మంగళవారం జిల్లా అద్యక్షులు జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుట్ట లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా ఢీల్లీ లిక్కర్ స్కాం కేసులో 5 నెలలు పైబడి కవిత తీహార్ జైల్లో ఉన్నారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఆమె ఈ రోజురాత్రి లేదా.
రేపు ఉదయం జైలు నుంచి బయటకు రానున్నారనరని పేర్కొన్నారు.ఇది బిజెపి దురుద్దేశ పూరితమైన కేసు అని ఈ కుట్రలో తాము బలయ్యామని కార్యకర్తలు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా BRS పార్టీ జిల్లా కార్యాలయంలో టపాసులు కాల్చి, మిఠాయిలు పంచుకుని సంబురాలు జరుపుకున్నారు
ఈ కార్య్రమంలో దదన్న గారి విట్టల్ రావు,సుజిత్ సింగ్ ఠాగూర్, సిర్ప రాజు తదితరులు పాల్గొన్నారు.
