జిల్లాలో తిరగాల్సిన ఆటో రిక్షాలు హైదారాబాద్ తరలివెళ్తున్నాయి. రవాణా శాఖ నిర్దేశించిన నియమాలను తుంగలో తొక్కేస్తున్నాయి. దర్జాగా రాజధానిలో చక్కర్లు కొడుతున్నాయి.మామూళ్ల మత్తులో ఉండే అధికారులు ఈ ఆటో ల విషయంలో చూసి చూడనట్లుగా వుంటున్నారు. ఇదివరకు వందల్లో ఉండే ఆటో ఇప్పుడు వేలాది గా రాజధాని విధుల్లో తిరుగుతున్నాయి.
జిల్లాలో ఉపాధి అవకాశాలు తగ్గడంతో ఆటో వాలా లు రాజధాని వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిచింది. ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీల్లో ఇదొకటి అందుకే ఉన్నపలంగా అమల్లో కి తెచ్చింది. దీనితో సహజంగా నే జిల్లాలో అందులోనూ గ్రామీణ ప్రాంతాల్లో ఆటో రిక్షాలకు గిరాకీ తగ్గింది. ఫైనాన్స్ లనుంచి లోన్ తీసుకోని ఆటో రిక్షాలతో జీవనం సాగిస్తున్న వారికి శరాఘాతం అయింది. దీనితో వారంతా హైదారాబాద్ బాట పట్టారు. నిజానికి జిల్లాలో రిజిస్ట్రేషన్ అయ్యే ఆటో రిక్షాలు జిల్లాకే పరిమితి కావాలి కానీ ఏకంగా అనేక జిల్లాలు దాటి హైదారాబాద్ వెళ్తున్నారు. రవాణా శాఖ నిబంధనలకు ఇది విరుద్ధం.
జిల్లాలో రిజిస్ట్రేషన్ అయ్యే ఆటో రిక్షాలు ఇతర జిల్లాలో తిరగడానికి ఎలాంటి అనుమతులు వుండవు. కానీ రాజధాని హైదారాబాద్ లో ప్రస్తుతం సుమారు పదిహేను వేలకు పైగా ఇతర జిల్లా నుంచి వచ్చిన ఆటో రిక్షాలు తిరుగుతున్నాయి. వీటికి ఫైన్ వేసి వదిలేసేది వుండదు సీజ్ చేయడమే. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ మెదక్ ,కరీం నగర్ నిజామాబాద్ మహబూబ్ నగర్ జిల్లాల నుంచి వేలాది ఆటో రిక్షాలు రాజధాని రోడ్ల మీద యథేచ్ఛగా తిరుగుతుండడం తో హైదారాబాద్ కు చెందిన ఆటో వాలా ఉపాధి అవకాశాలకు గండి పడుతుంది.
రంగారెడ్డి మేడ్చల్ వికారాబాద్ లాంటి జిల్లాల నుంచే వచ్చే ఆటో ల విషయంలో అధికారులు చూసి చూడనట్లుగా ఉంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు. సుదూర జిల్లాల నుంచే వచ్చిన ఆటో ల విషయంలో అదే ధోరణి తో వుంటున్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే ఆటో ల వల్ల తమకు గిరాకీ లేకుండా పోతుందనిపలితంగా తామకుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆటో వాలా లు ఆవేదన చెందుతున్నారు.
తాము రవాణా శాఖ అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా సీరియస్ యాక్షన్ తీసుకోవడం లేదని ఎస్ ఆర్ నగర్ కు చెందిన ఆటోవాలా సుభాష్ అన్నారు. నిజానికి ఇతర జిల్లాల ఆటో రిక్షాలు హైదారాబాద్ లో తిరిగితే నష్టపోయేది అందులో ప్రయాణించే వారే నని ఎందుకంటే ఆ ఆటో కు ఏదైన ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ వర్తించదు.ప్రమాదం లో గాయపడ్డ లేదంటే చనిపోయిన కంపెనీలు నష్టపరిహారం ఇవ్వరు.
ప్రయాణికుల ప్రాణాలను ఫణంగా పెట్టి ఆటో లను నడపడం భావ్యం కాదని వారు ఆవేదన చెందుతున్నారు. రవాణా శాఖ అధికారులకు ఈ విషయం తెలిసి కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇతర జిల్లాల ఆటో లను పట్టుకొని వారినుంచి వెయ్యి నుంచి 5 వందలు వసూలు చేసుకొని వదిలేస్తున్నారు. అందుకే పొరుగు జిల్లానుంచి ఆటో యథేచ్ఛగా హైదారాబాద్ వచ్చేస్తున్నాయి. ఉపాధి పేరుతొ ఆటో లను తెచ్చి ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడడం ఆక్షేపణీయం.