టాస్క్ ఫోర్స్ పోలీసులు ఓ రైస్ మిల్ లో నిల్వ చేసి ఉంచిన రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. సుమారు 120 టన్నుల రేషన్ బియ్యన్ని స్వాధీనం చేసుకొన్న రు పోలీసులు రైస్ మిల్లును సీజ్ చేసి తదుపరి దర్యాప్తు కోసం స్థానిక ఎస్సై వినయ్ కుమార్ కు అప్పగించారు పోలీసుల స్వాధీనంలో ఉన్న రైస్ మిల్లుకు ఆదివారం ఉదయం సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్ ఓ ఎస్ డీ శ్రీధర్ రెడ్డి బృందం వచ్చారు.
అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యాన్ని లారీ ల్లో లోడ్ చేయించి మాక్లూర్ లోని సాయి కృష్ణ రైస్ మిల్లుకి స్విఫ్ట్ చేశారు. అక్కడ బియ్యాన్ని కాంటా వేసి అక్కడే కస్టడీ లో ఉంచనున్నట్లు ఓఎస్ డీ తెలిపారు. వజ్రా ఇండస్ట్రీస్ ఓనర్ సాయిక్రిష్ణ గౌడ్ పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
