కరెంటు శాఖలో కల్లోలం- ఆర్మూర్ డిఈ పై ఆకాశ రామన్నల ఫిర్యాదు- అవినీతి ఆరోపణలు అవాస్తవం- ఆరోపణలు నిజం చేస్తే దేనికైనా సిద్ధం- నిబద్ధతగా పనిచేసినందుకే కుట్రపూరిత ఆరోపణలు – డిఈ హరిచంద్
కింది స్థాయిలో పనిచేసే కొందరు ఉద్యోగులకు క్షేత్రస్థాయిలో ఆడిందే ఆట… పాడిందే పాటగా తయారైంది. వీరి ఆట పాటలకు ఆటంకం కల్పించే ఎంతటి ఉన్నతాధికారినైనా వీరు విడిచిపెట్టరు అనడానికి చక్కటి ఉదాహరణల తయారైంది ప్రస్తుత పరిస్థితి.
అంతా ప్రశాంతంగా ఉన్న ఆర్మూర్ విద్యుత్ శాఖలో ఒక్కసారి అవినీతి ప్రకంపనలు అంటూ ప్రచారం హోరెత్తించాయి. ట్రాన్స్ కో ఆర్మూర్ డివిజనల్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్న హరిచంద్ నాయక్ పై కింది స్థాయిలో పనిచేస్తున్న అసిస్టెంట్ ఇంజనీర్లు తమ శాఖలో భారీ అవినీతి జరుగుతుందంటూ ఊరు పేరు లేకుండా ఆకాశరామన్న ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం ఓ గ్లోబల్ ప్రచారంల మారిపోయింది.
అంతేకాకుండా ఈ వ్యవహారంపై మీడియాలో కూడా కథనాలు రావడంతో సిఎండి ఉన్నతాధికారులు ఏపీటీఎస్ అధికారుల బృందంతో విచారణకు ఆదేశించారు విచారణ ముగియకంటే ముందే అన్ని తానై ఆర్మూర్ ట్రాన్స్కో డిపార్ట్మెంట్లో ఏళ్లుగా పాతుకుపోయిన ఓ వ్యక్తి ఈ వ్యవహారం వెనకాల దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆర్మూర్ డివిజన్ లో కొందరు విద్యుత్ ఉద్యోగుల ఆగడాలు పీక్ స్థాయికి చేరినట్టు పుకార్లు రేకెత్తిస్తున్నాయి. కొందరు కింది స్థాయి ఉద్యోగులు సిండికేట్ గా మారి తమ పనికి అడ్డు వచ్చిన ఇంతకీ ఉన్నతాధికారికైనా అసత్య ఆరోపణలు చేసి బదిలీ చేయించే ప్రయత్నాలు చేస్తారని ప్రజలు చర్చించుకుంటున్నారు.
కింది స్థాయిలో పనిచేసే కొందరు ఉద్యోగులకు క్షేత్రస్థాయిలో ఆడిందే ఆట… పాడిందే పాటగా తయారైంది. వీరి ఆటపాటలకు ఆటంకం కల్పించి ఎంతటి ఉన్నతాధికారునైనా వీరు విడిచిపెట్టరు అనడానికి చక్కటి ఉదాహరణల తయారైంది ప్రస్తుత పరిస్థితి.
విద్యుత్ శాఖలో ఉన్నత కిందిస్థాయి ఉద్యోగుల మధ్య సమన్వయంతో సాగాల్సిన సర్వీసులు ఇటువంటి ఆకాశ రామన్నల ద్వారా మాయని మచ్చను మూటగట్టుకుంటున్నారు. ఏదైనా అవినీతి ఆరోపణ ఉంటే నేరుగా ఆరోపించే వ్యక్తి తన పేరట ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.
కానీ అతీగతి లేని రీతిలో ఊరు పేరు లేకుండా ఫిర్యాదు రావడంతో ఉండి ఉన్నతాధికారుల సైతం దీనిపై సమగ్రమైన విచారణకు ఆదేశించారు. ఊరు పేరు లేకుండా తనపై అసత్య అవినీతి ఆరోపణ చేసి, మానసికంగా దెబ్బతీయాలని కుట్ట జరుగుతున్నట్టు డి ఈ వెల్లడించారు.
నిక్కచ్చిగా కిందిస్థాయి అధికారుల పని విషయంలో వ్యవహరించడమే ఈ కుట్రకు కారణమన్నారు. తనను బదిలీ చేయించేందుకే తప్పుడు కల్పనలు కల్పించాలని ఆయన వాపోయారు.
తనపై కుట్టపురితంగా చేసిన ఆరోపణలని అవస్థవాలని, నాలుగైదు రోజుల నుంచి ఆర్మూర్ డిఈ హరిచంద్ నాయక్ పై వచ్చిన అవినీతి వేధింపుల ఆరోపణలపై సిఎండి ఆదేశాల మేరకు ఏపీ టీఎస్ అధికారుల బృందం విచారణ చేస్తుందని, తన దోషినని తేలితే ఇంతటి శిక్షకైనా సిద్ధమని డి ఈ హరిచంద్ నాయక్ అన్నారు.
చిలికి చిలికి గాలి వానలా మారిన ఈ వ్యవహారం ఎలా ముగుస్తుందో చూడాలి మరి…!