Saturday, May 2, 2026
HomeLaw and Orderపోలీస్ శాఖ ఆద్వర్యంలో సైకిల్ ర్యాలీ..ర్యాలీలో పాల్గొన్న పోలీస్ కమిషనర్ సాయి చైతన్య..

పోలీస్ శాఖ ఆద్వర్యంలో సైకిల్ ర్యాలీ..ర్యాలీలో పాల్గొన్న పోలీస్ కమిషనర్ సాయి చైతన్య..

నిజామాబాద్ పోలీస్ శాఖ ఆద్వర్యంలో అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నగరంలోని పులాంగ్ చౌరస్తా నుంచి నెహ్రూ పార్క్ వరకు సీపీ సాయి చైతన్య, అడిషనల్ డిసీపీ బస్వా రెడ్డి ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ..

ఎందరో పోలీస్ సిబ్బంది ప్రగతి అంతర్గత భద్రత కాపాడటానికి నక్సలైట్లు,మతపరమైన విభజన శక్తులు,ఇతర సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ నేరాల అరికట్టడం,మాదక ద్రవ్యాల అణచివేయడానికి,మహిళ భద్రతకు తమ ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు.వీరి త్యాగాల వల్లనే ఈరోజు దేశం సంతోషంగా ఉందన్నారు.

ముఖ్యంగా నిజామాబాద్ కమిషనరేట్ లో ప్రజల కోసం ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు ఈ నేల చెరగని ముద్ర వేసిందని అన్నారు.జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా చూడాలని అన్నారు.ఎక్కడ ఎలాంటి సంఘటన చోటు చేసుకున్న వెంటనే పోలీసులకు సమాచారం అందించలాని కోరారు.

ఈ మేరకు పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాల భాగంగా పోలీసు కుటుంబలను ప్రమర్శించినట్లు తెలిపారు. మన పోలీసులు ఒకటే కుటుంబం వారు వేసుకున్న యూనిఫాం అందరికీ గర్వకారణమని వారి త్యాగాల వల్ల నేడు మనం గర్వంగా బతుకుతున్నామని కొనియాడారు.

నిజామాబాద్ పోలీస్ ఎల్లప్పుడు వారి కుటుంబంలో తోడుగా ఉంటుందని ధైర్యాన్ని ఇచ్చారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో మాదక ద్రవ్యాలు, నేరాలు, అరికట్టాలని అందుకు ప్రజలు సహకరించాలని తెలిపారు.

ఈ దేశం కోసం న్యాయం కోసం ఎప్పటికీ తలవంచకుండా,పక్షపాతం లేకుండా,సేవా చేయడానికి మన హృదయలతో ప్రమాణం చేద్దామని పేర్కొన్నారు.అదేవిధంగా ఈ నెల 29న రక్త దాన శిబిరం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసీపీ బస్వా రెడ్డి,జిల్లాలోని సీఐ,ఎస్ఐలు,పోలీస్ సిబ్బంది, ఎన్ సీసీ విద్యార్థులు, స్కూల్ విద్యార్థులు, పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!