కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్య చేసిన రియాజ్ కుటుంబాన్ని కలవడానికి హైదారాబాద్ నుంచి యంబిటి నాయకుడు అంజాద్ ఉల్లా ఖాన్ శనివారం నిజామాబాద్ పర్యటన ను అడ్డుకోవాలని పలు సంఘాలు పోలీస్ కమిషనర్ ను కోరాయి.
ఈ మేరకు ఆయను తన కార్యాలయం లో కలసి వినతి పత్రం ఇచ్చారు. కానిస్టేబుల్ ను హత్య చేసిన రియాజ్ ఎన్ కౌంటర్ ను అన్నీ వర్గాలు హర్షించాయని అలాగే ప్రమోద్ కుటుంబాన్ని సైతం యంఐయం తో సహా అనేక మంది మైనారిటీ నేతలు స్వయంగా వెళ్ళి ఓదార్చాయని వారు గుర్తు చేశారు.
ఇలాంటి పరిస్థితి ల్లో అంజదుల్లా ఖాన్ వచ్చి రెచ్చగొట్టేలా మాట్లాడితే నగరంలో మత సామరస్యానికి భంగం కలుగుతుందన్నారు అందుకే ఆయన నగరానికి రాకుండా నిరోధించాలి .
ఆయన వస్తే నగరంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉంది పోలీసులు అరెస్ట్ చెయ్యని పక్షం లో మేమే అడ్డుకుంటామని పేర్కొన్నారు
