HomeCRIMEఅధికార పార్టీకి మైనింగ్ మరకలు ......నేతల పేరుతొ అడ్డగోలుగా దోచేస్తున్నారు ........ఎవరి వాటాలు...

అధికార పార్టీకి మైనింగ్ మరకలు ……నేతల పేరుతొ అడ్డగోలుగా దోచేస్తున్నారు ……..ఎవరి వాటాలు వారికేనా ? ఆలస్యంగానైనా రంగంలోకి దిగిన బీజేపీ ……….మొద్దు నిద్రలోనే అర్బన్ నేతలు

జిల్లాలో ఆయా ప్రాంతాల్లో ఇసుక మొరం అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి అధికార పార్టీకి ఇవే అసలైన ఆదాయ వనరులుగా మారాయి.

అధికార పార్టీలో దిగ్గజ నేతల మాటున వారి అనుయాయులు దర్జాగా ఈ అక్రమ దందాలకు తెరలేపారు. అందుకే యంత్రాంగం చేతులెత్తేసింది. అయిన కాడికి తమ వాటాలు మెక్కేస్తుంది. జిల్లా కేంద్రంలో ఉండే ఉన్నతస్థాయి అధికారులు ఉత్తిత్తి బీరాలు పలకడానికి పరిమితం అవుతున్నారు.

జిల్లాలో ఆర్మూర్ బాల్కొండ నియోజకవర్గాల సంగతి ఎలా ఉన్న జిల్లా కేంద్రానికి నాలుగు వైపులా ఉండే మూడు నియోజకవర్గాలో జస్ట్ 20 కిలో మీటర్ల లోపే ఈ దందా సాగుతున్నాయి. అదీగాక తవ్వకాలు అక్కడే జరిగిన రవాణా అమ్మకాలు మాత్రం జిల్లా కేంద్రంలోనే సాగుతున్నాయి.

అయినా యంత్రాంగానికేమి సోయి లేనట్లుగా ఉంది. సరే అధికార పార్టీనేతల అండగా తో కోట్ల రూపాయల వ్యవహారం కావడంతో అధికారులు వచ్చిన వాటాలే మహా భాగ్యం అనుకోని సైలెంట్ అయ్యారు కానీ ప్రతిపక్ష నేతలు ఎందుకు మౌనం ఊహో నేతలు ఇలాంటి వ్యవహారాల్లో పార్టీలకు అతీతంగా కల్సి కట్టుగానే వుంటారు.

గత పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్ యస్ నేతలు ఇవే దందాల్లో కోట్లకు పడగలెత్తారు. ఏ మాత్రం నోరెత్తిన తమ గత పాపాల పుట్టలు మిగులుతాయని భయం అందుకే మాజీ ఎమ్మెల్యే లు హైదారాబాద్ దాటి రాలేక పోతున్నారు.

సరే ఆలస్యంగానైనా బీజేపీ నేతలు రంగంలోకి దిగారు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మల్కాపూర్ లోబీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి గారు మొరం క్యారీలను పరిశీలన చేశారు.

ఈ సందర్బంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి మాట్లాడుతూ ప్రభుత్వ భూముల్లో అక్రమ మొరం తవ్వకాలు జరుగుతున్నాయని తెలిపారు.

ఈ దందాకు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ప్రోత్సాహం ఉందని ఆరోపించారుప్రభుత్వం ప్రజల కోసం భూములు కేటాయించింది కానీ కాంగ్రెస్ నేతలు దోపిడీకి దిగారు అన్నారు.మల్కాపూర్, జాన్కంపేట్, ప్రాంతాల్లో మొరం మాఫియా పంజా వేసిందన్నారు.

రోడ్డుపై వందలాది టిప్పర్లు తిరుగుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని చెప్పారు.పిల్లలు, వృద్ధులు, మహిళలు దుమ్ము దులిలో శ్వాస తీసుకోవడానికీ ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.రూరల్ ఎమ్మెల్యే ప్రజల కోసం పనిచేయాల్సింది పోయి అవినీతి దందాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి లేక అవినీతి మాత్రం పెరిగిపోయిందన్నారు.రోడ్లు చెదిరిపోయాయి, చెరువులు ఎండిపోయాయి, ప్రజల గోస ఎవరూ వినడం లేదన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పరాకాష్టకు చేరిందని విమర్శించారు.

ఇంచార్జి మంత్రులు కేవలం ఫోటోలు, ప్రకటనలకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు.జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి క్వారీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన, ధర్నాలు, కార్యక్రమాలు చేస్తామని తెలిపారు.

అధికారులు ఎమ్మెల్యే పాదసేవకులుగా కాకుండా ప్రజల పక్షాన ఉండాలని హితవు పలికారు.ఒక అధికారి “ఎంఎల్ఏ చెప్తేనే పర్మిషన్ ఇస్తా” అని చెప్పడం సిగ్గుచేటు అని దుయ్యబట్టారు..ఈ సందర్భంగా ఓ అధికారి ఆడియో కాల్‌ను మీడియా ముందు విడుదల చేశారు.కానీ ఇప్పటికూడా అర్బన్ బీజేపీ నేతలు మాత్రం ఇంకా నిద్ర మత్తులోనే జోగుతున్నారు నగరంలో నాగారం లో గోషాల భూముల్లో కోట్ల రూపాయల విలువైన మొరం తవ్వకాలు సాగించినా ఏ మాత్రం పట్టనట్టుగా ఉండిపోయారు.

అధికార పార్టీ లో కీలక నేతలతో మంచి దోస్తానా వుండడం వల్లే బీజేపీ నేతలు ఈ అక్రమ దందా ల జోలికి వెళ్లలేక పోతున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments