మాయదారి వైరస్ కోళ్ల పరిశ్రమను కుదిపేస్తోంది. బాయిలర్ కోళ్ల వ్యాపారం ను వైరస్ కోలుకోలేని దెబ్బ తీస్తుంది.వైరస్ ముప్పు తో వణికి పోతుంది. మహమ్మారి క్రమేపి విస్తరిస్తుండడంతో సర్వత్ర ఆందోళన వ్యక్తం అవుతుంది.
ఈపాటికే చికెన్ అమ్మకాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఏవియన్ ఇన్ ఫ్లూయెన్జా వైరస్ ముప్పేట దాడి తో అప్రమత్తం అయిన తెలంగాణ ప్రభుత్వం పొరుగు రాష్ట్ర ల నుంచి గుడ్లు కోళ్ల రవాణా మీద కఠిన ఆంక్షలు అమల్లోకి తెచ్చింది.
సరిహద్దుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో నాలుగు చోట్ల చెక్ పోస్టు లను అందుబాటులోకి తెచ్చింది మరో వైపు జిల్లా యంత్రాంగం ను సైతం అలర్ట్ చేసింది.
అనారోగ్యం తో ఉన్న కోళ్ల రవాణా చేసే విషయంలో అలాగే చనిపోయిన కోళ్లను పూడ్చి పెట్టె విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేసింది. అలాగే వైరస్ కట్టడికి పశుసంవర్ధక శాఖ ఆయా ప్రభుత్వ శాఖలతో సమన్వయసమావేశాలు నిర్వహించాలని స్పష్టం చేసింది. మరో వైపు జిల్లాలో వైరస్ కోళ్ల పరిశ్రమ మీద పంజా విసురుతుంది.
వేలాది కోళ్లు వైరస్ బారిన పడి పిట్టల్లా రాలి పోతున్నాయి. సోమవారం ఒక్క రోజే బోర్లం లో సుమారు 8 వేల కోళ్లు మృతి, చెందాయి.గత వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా కోళ్లు మృత్యువాత పడుతున్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి.
కమ్మర్ పల్లి నవీపేట్ పొతంగల్ వేల్పూర్ బీమ్ గల్ ప్రాంతాల్లో వేలాది కోళ్లు వైరస్ బారిన పడి చనిపోయాయి. వైరస్ సోక కుండా తీసుకోవాల్సిన జాగ్రత్త ల విషయంలో పౌల్ట్రీ నిర్వాహకులకు అవగాహన కల్పిస్తున్నారు.
మృతి చెందిన కోళ్ల నుంచి ఆనవాళ్లు సేకరించి హైదారాబాద్ వెటర్నరీ బయోలాజికల్ ల్యాబ్ యూనిట్ కు పంపిస్తున్నారు. వైరస్ సోకిన మూడు రోజుల్లోపే కోళ్లు మృత్యువాత పడుతున్నాయి.
