నిజామాబాద్ లోని మోస్రా పాఠశాలల్లో డీఈవో అశోక్ బుదవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.పదవ తరగతి తరగతి గదికి వెళ్లి విద్యార్థులకు గణిత శాస్త్రం బోధించారు. విద్యార్థులతో కలిసి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
మధ్యాహ్న భోజన ఏర్పాట్లను పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
అలాగే పరిశుభ్రమైన వాతావరణంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేయాలని, ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకునేలా చూడాలని పేర్కొన్నారు.
