Sunday, April 19, 2026
HomeCRIMEమాదకద్రవ్యాలతో భవిష్యత్‌ నాశనం...

మాదకద్రవ్యాలతో భవిష్యత్‌ నాశనం…

మాదకద్రవ్యాల అలవాటుతో భవిష్యత్‌ నాశనమ వుతుందని, మాదకద్రవ్యాల నివారణకు సమష్టిగా కృషి చేయాలని టీజీ ఎన్‌ఏబీ(యాంటీ నార్కోటిక్ బ్యూరో), ఏసిపి సోమనాథం పేర్కొన్నారు.

గురువారం బోధన డివిజన్ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో విద్యార్థులకు డ్రగ్స్ వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

విద్యార్థి దశ నుంచే డ్రగ్స్ వినియోగానికి దూరంగా ఉండాలని సూచించారు. మాదక ద్రవ్యాలకు అలవాటుపడిన తర్వాత జీవన శైలి మారిపోయి, వారు నిర్వర్తించాల్సిన బాధ్యతలను మర్చిపోతారని వివరించారు.

అత్యంత కఠినంగా మాదక ద్రవ్యాలు సరఫరా చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించిందని, మాదక ద్రవ్యాల రవాణా, సాగు, వినియోగం నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. నేటి యువత భావిభారత పౌరులని, వీరిలో కొంతమంది డ్రగ్స్‌కు ఆకర్షితులైతే దేశ భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు.

దీనిని గుర్తించి డ్రగ్స్‌వల్ల కలిగే విపరీత పరిణామాలపై అవగాహన పెంచుకొని దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్‌తో పాటు, గుట్కా, గంజాయి, మాదక ద్రవ్యాలు, సిగరెట్‌ మొదలగు చెడు అలవాట్లకు సైతం దూరంగా ఉండాలనీ విద్యార్థులకు హెచ్చరించారు.

చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుందని, ఆలోచనా విధానం, ఆలోచనా శక్తి నశిస్తాయన్నారు. భావితరాలు మాదకద్రవ్యాలపై ఆకర్షితులు కాకుండా వారికి సమాజంలో మంచి, చెడు తెలియజేయాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో, సీఐ పూర్ణేశ్వర్ టీజీ ఎన్‌ఏబీ, ఎస్‌హెచ్‌వో బోధన్ పాల్గొన్నారు. డిగ్రీ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!