Thursday, April 23, 2026
HomeCRIMEఫ్యాక్షన్ తరహాలో మాజీ ఎంపీపీ హత్య ……వెంటాడి కారు ఢీకొట్టి ….కత్తులు గొడ్డళ్ళ తో పొడిచి...

ఫ్యాక్షన్ తరహాలో మాజీ ఎంపీపీ హత్య ……వెంటాడి కారు ఢీకొట్టి ….కత్తులు గొడ్డళ్ళ తో పొడిచి హత్య ……

తీవ్రవాద ప్రాబల్యం తగ్గాక పడి పంటలతో ప్రశాంతంగా ఉండే ధర్పల్లి ప్రాంతంలో ఫ్యాక్షన్ తరహాలో జరిగిన హత్య కలకలం రేపింది. అచ్చం అదే తరహాలో కారులతో వెంటాడి ఆపై ఢీకొట్టి కత్తులు గొడ్డళ్ళ తో తెగనరికారు.

అదికూడా అధికార పార్టీలో కీలక నేతగా ఉన్న మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి ని బుధవారం దారుణం హత్య కు గురయ్యారు.పోలీసు శాఖ నే ఉలిక్కి పడేలా చేసిన ఈ ఉదంతం ! సీపీ సాయి చై తన్య హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లారు.

గోపి సమీప బంధువే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు ఇందల్ వాయి మండలం లింగాపూర్ గ్రామ నికి చెందిన గోపి బుధవారం రాత్రి గ్రామానికి కారులో వెళ్తుండగా గ్రామ శివారులో ని అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు మరో కారు తో గోపి కారు ఢీకొట్టారు. దీనితో డ్రైవర్ భాగంలో సేఫ్టీ బెలూన్ ఓపెన్ అయ్యాయి కానీ డ్రైవర్ గాయాలు కావడంతో స్టీరింగ్ వదిలేసాడు.

ఊహించనిఆక్సిడెంట్ తో షాక్ అయిన గోపి డ్రైవర్ సిట్ లోకి వెళ్లడానికి సిద్ధం అయ్యాడు కానీ ఈలోపు అదే కారు వెనుక నుంచి వచ్చి మరోసారి బలంగా ఢీకొట్టింది. దీనితో గోపీ కారులోనుంచి కిందికి దిగి ఎవరు మీరు అంటూ గట్టిగా కేకలు వేసాడు.

తన సమీప బంధువే కళ్ళ ముందుకు రావడంతో మరింత షాక్ అయ్యాడు కానీసదురు వ్యక్తి గట్టిగా పట్టుకోవడంతో గుర్తు తెలియని మరో ఇద్దరు గొడ్డలి తో వెనుక నుంచి బలంగా కొట్టడంతో గోపి అక్కడే కుప్పకూలి పోయాడు కానీ మరో ఇద్దరు కూడా వచ్చి కత్తులతో పొడిచారు మెడ భాగంలో ను గొడ్డలి పోటు పడడం తో రోడ్డుమీదే ప్రాణాలు వదిలేసాడు.

బుధవారం సాయంత్రం లింగాపూర్ నుండి గౌరారం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన రాత్రి పది గంటల ప్రాంతంలో జరిగింది ఆ సమయంలో ఆ రోడ్డు మార్గంలో ఎవ్వరు రాక పోవడంతో చాల సేపు వరకు గోపి రోడ్డు మీద పడి ఉన్నారు ఆయన కారు డ్రైవర్ సైతం అపస్మార స్థితిలో ఉన్నాడు.ద్విచక్ర వాహనం మీద వెళ్తున్న ఓ వ్యక్తి గోపీ గుర్తు పట్టి వెంటనే పోలీసులకు సమాచారమ్ ఇచ్చాడు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!