రాష్ట్రంలో దాదాపు 235 మండలాల్లో తీవ్ర వర్షభావంతో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, తక్షణం చేపట్టాల్సిన చర్యలపై కేబినెట్ సబ్ కమిటీలో చర్చించాలని మంత్రి మండలి నిర్ణయించింది సీఎం రేవంత్ అధ్యక్షత మంత్రి మండలి బుధవారం సచివాలయం లో జరిగింది.
త్వరలోనే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న ఎల్ నినో పరిస్థితులు.. చేపట్టాల్సిన ఉపశమన చర్యలపై సలహాలు సూచనలు స్వీకరించాలని నిర్ణయించారు.
కరువు మండలాల ప్రకటనతో పాటు రాష్ట్రానికి తగిన సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు త్వరలోనే ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర పరిస్థితిని నివేదించాలని కేబినెట్ నిర్ణయించింది.
