లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన కవితను విచారిస్తున్న ఈడీ అధికారులు తదుపరి . కార్యాచరణ ఎలా ఉండబోతుందనేది ఉత్కంఠ గా మారింది.రెండో దఫా కస్టడీ కూడా కోర్టు అనుమతిఇవ్వడంతో ఇంకా మరింత లోతుగా దర్యాప్తు జరిగే అవకాశం ఉంది. ఆమె ఈడీ విచారణలో ఎలాంటి విషయాలు చెప్పారనేది ఆసక్తిగా మారింది.
లిక్కర్ కేసు విచారణలో వంక తో ఆమె ఆస్తులు బినామీ లేవరనేది అరా తీశారని ప్రచారం జరుగుతుంది. ఆమె ఇచ్చిన సమాచారం మేరకే భర్త అనిల్ మేనల్లుడు శరణ్ లను విచారించే పనిలో ఉన్నారు. ఆమె తో పాటు పీఏ లు రాజేష్ ఫోన్లను సీజ్ చేసిన ఈడీ అందులో ఉన్న డాటా మేరకు నిజామాబాద్ జిల్లాలో ను కవిత నెట్ వర్క్ మీద నిఘా వేశారని సమాచారం.
ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో ఆమె సన్నిహితులు సమీప బంధువులపై కూడా నిఘా పెట్టారు. వారికి సంబంధించిన ఆస్తుల తో వారు ఎలాంటి దందాలు చేస్తుంది అరా తీస్తున్నారు.ఆమె పీఏ రాజేష్ ఫోన్ లో నలుగురు బడా వ్యాపారుల వివరాలను మీద ఈడీ ఫోకస్ పెట్టారని ప్రచారం జరుగుతుంది .
ఇందులో భాగంగానే ఈడీ అధికారులు నిజామాబాద్‌కు వచ్చే అవకాశం ఉందిఈలోపు ఈడీ ఇచ్చిన సమాచారం మేరకు , కవిత ఆస్తుల వ్యవహారలను తేల్చడానికి స్థానిక సెంట్రల్ ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఆమె మామ అనిల్ తండ్రి రాంకిషన్ రావు దశాబ్దాల తరబడిగా లిక్కర్ దందాలోనే ఉన్నారు .
ఆయన ఆనతి కాలం లోనే ఆర్థికంగా ఎలా ఎదిగారనేది అరా తీస్తున్నారు. ఆయన పేరు మీద ఎక్కడెక్కడ ఆస్తులున్నాయనేది వాకబు చేస్తున్నారు.అలాగే అనిల్ కు కానీ కవిత లకు నిజామాబాద్ జిల్లాలో ఆస్తులు ఏమి ఉన్నాయనేది తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా జాగృతి లో క్రియాశీలకంగా పనిచేస్తున్న ముగ్గురి ఆర్థికస్థితి గతులు అరా తీస్తున్నారు. ఇందులో భాగంగానే కవిత ఆస్తులకు బినామీలు ఎవరైనా ఉన్నారా? అనే కోణంలోనూ ఈ విచారణచేస్తున్నారు.
/// కొటారి పైనే ఈడీ ఫోకస్ /////
కవిత ఆమె భర్త అనిల్ చుట్టూ ఉండే సన్నిహితులు లందరి మీద ఈడీ ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా రెగ్యులర్ గా ఫోన్ లో టచ్ లో ఉండే అందరీ ని స్కాన్ చేస్తున్నారు ఇందులో భాగంగా గత పదేళ్లుగా ఆమె వద్దే పాతుకుపోయి పనిచేస్తున్న వారిలో ఓ రెవెన్యూ ఉద్యోగిపై విషయంలో ఈడీ అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు సమాచారం.
మరింత సమాచారం కోసం ఈడీ అధికారులు హైదారాబాద్ నుంచి నిజామాబాద్‌కు వచ్చే అవకాశంవుందని ప్రచారం జరుగుతుంది.
అయితే ఆమె భర్త అనిల్ మేనల్లుడు మేక శరణ్ లను విచారించక తదుపరి దర్యాప్తు కోసం ఈడీ నిజామాబాద్ వచ్చే అవకాశం ఉంది. నందిపేట్ కు చెందిన బడా రియల్టర్ కోసం సైతం ఈడీ వాకబు చేస్తుంది.సదరు లిక్కర్ వ్యాపారి కవిత బినామీగా అనుమానిస్తున్నారు..
కవిత ఇంట్లో జరిపిన సోదాల్లో మేక శరణ్ ఫోన్ లభించిందని, రెండు సార్లు పిలిచినా శరణ్ విచారణకు రాలేదని కోర్టుకు ఈడీ తెలియజేసింది. సౌత్ లాబీ డబ్బు లావాదేవీల్లో శరణ్ దే కీలక పాత్ర ఉన్నదని మేక శరణ్ కవితకు అత్యంత సన్నిహితుడని, కవిత అరెస్ట్ సమయంలో శరణ్ ఇంట్లోనే ఉన్నారని ఈడీ తన అఫిడవిట్‌లో పేర్కొంది.
అరెస్ట్ సమయంలో శరణ్ ఫోన్‌ను సీజ్ చేసి పరిశీలించగా అందులో సౌత్ లాబీకి సంబంధించిన లావాదేవీల సమాచారం గుర్తించినట్లు తెలిపింది.ఆయన ఫోన్ లో నందిపేట్ రియల్టర్ పేరు కూడా ఉందని తెల్సింది.శరణ్ కోసం ఈడీ గాలిస్తుంది.
