ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటించి, బాధ్యతతో రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని నిజామాబాద్ ట్రాఫిక్ సీఐ ప్రసాద్ అన్నారు. మంగళవారం నగరంలోని ఆటో డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సు లో ట్రాఫిక్ సీఐ మాట్లాడుతూ..
రోడ్డు ప్రమాదాల నివారణ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, రహదారిపై వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబందనలు పాటించాలని సూచించారు. డ్రైవింగ్ లైసెన్ లేకుండా వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరు డ్రైవింగ్ లైసెన్ తీసుకోవాలని కోరారు.
ట్రాఫిక్ నియమాలను ఖచ్చితముగా పాటించాలని, దృవీకరణ పత్రములు ఉండాలని, రోడ్డు మధ్యలో పార్కింగ్ చేయవద్దని, ఓవర్ ప్యాసింజర్స్ తో నడపవ డద్దని, ఇన్సూరెన్స్ చేయించుకోవాలని మరియు మద్యం సేవించి ఆటోలు నడపవద్దని సూచించినారు.
లేని యెడల చట్టరీత్య చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ సుమన్,సిబ్బంది,డ్రైవర్లు యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.
