విద్యుత్ ఘాతం తో వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన నగరంలోని ఆటో నగర్ లో చోటు చేసుకుంది.కుటుంబ సభ్యుల సమాచారం మేరకు..ఆటో నగర్ కు చెందిన షేక్ ఇమ్రాన్(26).సంవత్సరం క్రితమే వివాహమైంది. ఇర్ఫాన్ అనే మేస్త్రి వద్ద పనులు చేస్తారు.
రోజువారీగా ఆటో నగర్ లోని మజీద్ వద్ద పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
అక్కడే ఉన్న స్థానికులు హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
