కార్పొరేషన్ రెవెన్యూ విభాగంలో ఆయనో మూడో స్థాయి అధికారి మాత్రమే ఆయన వద్దే కళ్ళు బైర్లు కమ్మే స్థాయిలో ఆస్తులు బయట పడ్డాయి. ఏసీబీ చరిత్ర లోనే అత్యంత నగదు దొరికింది కూడా ఆయన వద్దే.
ఇంచార్జ్ రెవెన్యూ అధికారి నరేందర్ ఆయన ఆస్తుల చిట్టా చూసి ఏసీబీ అధికారులే నివ్వరపోయారు. అసలు ఓ కింది స్థాయి అధికారే ఈ రేంజ్ ఆస్తులు కూడబెట్టడంటే ఆయన పై స్థాయిలో ఉండే అదికారుల మాటేమిటనేచర్చ సర్వత్ర ఉంది.
మున్సిపల్ కార్యనిర్వహణ వ్యవస్థ లో అనేక కీలక విభాగాలున్నాయి. ముఖ్యంగా రెవెన్యూ టౌన్ ప్లానింగ్ విభాగాల నుంచే వచ్చే ఆదాయమే మున్సిపల్ ఖజానా నిండుతుంది. అయితే ఇందులో రెవెన్యూ విభాగం లో డిప్యూటీ కమిషనర్ ,మేనేజర్ ల తర్వాతే రెవెన్యూ ఆఫీసర్ వుంటాడు.
పాలనాపరమైన వ్యవహారాల్లో ఆర్వో ఒక్కరే నిర్ణయం తీసుకొనే అధికారం లేదు.ఆస్థి పన్ను మదింపు …మ్యుటేషన్ ….ఆస్తి పన్ను వసూళ్లు ….లతో పాటు యింటి నెంబర్ల కేటాయింపు వంటి వ్యవహారాల్లోనే నరేందర్ అక్రమాలకు పాల్పడ్డారనేది ఏసీబీ విచారణలో వెల్లడయింది.
ముఖ్యంగా నగరంలో ప్రభుత్వ ప్రైవేట్ స్థలాలకు ఇంటి నెంబర్ అలాట్మెంట్ లలో భారీగా డబ్బులు వసూలు జరిగాయి.
నిజానికి ఈవ్యవహారాల్లో ఆర్వో జస్ట్ మొదటి స్థాయిలో పనిచేసే అధికారి మాత్రమే ఇలాంటి ఫైళ్లు మేనేజర్ డిప్యూడీ కమిషనర్ ను ధాటి కమిషనర్ సంతకంతో తుది ఆదేశాలు వస్తాయి.
గతంలో పింఛన్ అవకతవకల ఆరోపణలతో నరేందర్ సస్పెండ్ అయ్యారు. అలాంటి నేపథ్యం ఉన్న నరేందర్ కు ఏకంగా ఆర్ వో బాధ్యతలు అదికూడా ఇక్కడే ఇవ్వడం వెనుక బలంగా పనిచేసింది ఎవరనేది ఏసీబీ అరా తీస్తుంది.
గతంలో కమిషనర్ గా పనిచేసిన చిత్ర మిశ్రా ఆన్ లైన్ లో నమోదు చేసిన మూడు వేల ఇంటి నెంబర్లను ఆమె రద్దు చేసారు. కానీ ఈ వ్యవహారం వెనుక సాగిన వసూళ్ళ దందా గుట్టు ను మాత్రం రట్టు చేయలేక పోయారు.
అసలు ఈ వసూళ్ల దందా లో నరేందర్ ఒక్కడే పాత్ర దారిగా ఎలివేట్ అయ్యారు ఆ క్రమంలోనే ఏసీబీ సైతం టార్గెట్ చేసింది. నిజానికి ఏసీబీ రెడ్ హ్యాండ్ కేసులో అప్పటికపుడు వ్యూహరచన చేసి రైడ్ చేస్తుంది. కానీ ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులో ఏసీబీ పక్క ప్రణాళిక తో రైడ్ చేస్తుంది.
పిర్యాదు వచ్చిన వెంటనే లోతుగా దర్యాప్తు చేసి . పక్క ఆధారాలు వుంటేనే కేసు నమోదు చేస్తారు. ఆదాయం ఏ ఏ మార్గంలో సమకూర్చుకుంది రూఢి చేసుకుంటారు. ఖచ్చితంగా నరేందర్ విషయంలోనూ ఏసీబీ అదే నిబంధలు పాటించి వుంటుంది.
నరేందర్ ఆదాయం ఎలా వచ్చింది తెలుసుకున్న ఏసీబీ ఆయన పై స్థాయిలో ఉండే అధికారులకు ఏ మేరకు వాటాలు వెళ్లాయనేది అరా తీసారా? లేదా? అనేది సర్వత్ర ఆసక్తిగా మారింది.నరేందర్ దొడ్డి దారిలో రెవెన్యూ విభాగంలో ఏ పని చేసిన పైన ఉండే అధికారులు గుడ్డిగా క్లియర్ చేసే ఛాన్స్ వుండదు.
ఒక్కో ఫైల్ కు ఒక్కోరేట్ ఫిక్స్ చేసి ఇచ్చేసారు. ఎవరివాటాలు వారికి వెళ్తాయి.అయితే ఈ వ్యహారంలో నరేందర్ అత్యంత క్రియాశీలకంగా పనిచేసేది. అందుకే ఆయనే అందరి కన్న ఎక్కువగా ఫోకస్ అయ్యారు.
కానీ నరేందర్ తో సమానంగా వాటాలు మెక్కిన అధికారుల గుట్టు మాత్రం ఇంకా రట్టు కావడం లేదు.