HomeDevotionalహనుమాన్ జన్మోత్సవం సందర్భంగా నిజామాబాద్ నగరంలో భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించిన శోభాయాత్రలో ...

హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా నిజామాబాద్ నగరంలో భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించిన శోభాయాత్రలో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హనుమాన్ స్వామి విగ్రహ రథం వద్ద గణేష్ బిగాల గారు పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు పొందారు. నగరం మొత్తం భక్తి పారవశ్యంతో నిండిపోగా, “జై శ్రీరాం”, “జై హనుమాన్” నినాదాలతో ఆధ్యాత్మిక వాతావరణం అలరించింది.అనంతరం నిజామాబాద్ అర్బన్ BRS పార్టీ ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ, పండ్లు పంపిణీ చేసి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భక్తులతో ఆప్యాయంగా మమేకమై, వారికి అభివాదం చేస్తూ శోభాయాత్రలో కలిసి నడిచారు.గణేష్ బిగాల గారు మాట్లాడుతూ, హనుమాన్ స్వామి భక్తి, బలం, ధైర్యానికి ప్రతీక అని, స్వామివారి కృపతో ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు.

ప్రతి ఇంటిలో ఆనందం, ఐశ్వర్యం నిండాలని ప్రార్థించారు.ఈ శోభాయాత్రలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనేకమంది భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments